AC లోపలి నుంచి చప్పుళ్లు.. వెంటనే టెక్నిషియన్‌ను పిలిచారు.. ఓపెన్ చేయగా..

ప్రజంట్ ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నాం. దీంతో అందరూ ఏసీలు వినియోగిస్తున్నారు. అయితే ఏసీల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేదంటే వేల రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. తాజాగా ఓ కుటుంబానికి అలాంటి అనుభవమే ఎదురైంది .. ..

AC లోపలి నుంచి చప్పుళ్లు.. వెంటనే టెక్నిషియన్‌ను పిలిచారు.. ఓపెన్ చేయగా..
AC damage

Updated on: Apr 30, 2026 | 5:54 PM

ఇటీవల ఓ ఇంటిలో జరిగిన సంఘటన గృహ యజమానులకు హెచ్చరికగా మారింది. ఏసీలో పాము దూరిందని అనుమానంతో ఒక కస్టమర్ టెక్నీషియన్‌ను పిలిపించారు. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నీషియన్లు పరిశీలించగా, అది పాము కాదు.. ఎలుక అని తేలింది.
ఇటీవలే లక్షలు ఖర్చు పెట్టి రీమోడలింగ్ చేసిన ఆ ఇంటిలో ఏసీ అమర్చేటప్పుడు, దాని వెనుక భాగంలో ఉన్న చిన్న రంధ్రాన్ని పూడ్చడం మర్చిపోయారు. అదే గ్యాప్ ద్వారా లోపలికి వచ్చిన ఎలుక, ఏసీ బ్లోయర్‌లో ఇరుక్కుపోయి చనిపోయింది. ఈ కారణంగా ఏసీ లోపలి భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

టెక్నీషియన్ల తెలుపుతున్న వివరాల ప్రకారం, ఈ ఘటనలో పీసీబీ బోర్డు, మోటార్ వంటి కీలక భాగాలు పాడయ్యాయి. వాటిని మార్చడానికి వేల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇల్లు నిర్మాణానికి లక్షలు, ఏసీ కొనుగోలుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా, కేవలం కొన్ని రూపాయలతో పూడ్చాల్సిన చిన్న రంధ్రాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయని పేర్కొన్నారు.

ఏసీ ఇన్‌స్టాలేషన్ సమయంలో వెనుక గ్యాప్, రంధ్రాలను పూర్తిగా సీల్ చేయాలి. పైప్ వెళ్లే చోట ఖాళీలు ఉండకూడదు. కాలానుగుణంగా ఏసీ సర్వీసింగ్ చేయించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఏసీ వెనుక భాగంలో ఉన్న చిన్న రంధ్రాన్ని పూడ్చడం ద్వారా, అనవసర ఖర్చులను సులభంగా నివారించవచ్చు. ఒక్కసారి మీ ఏసీ విషయంలో ఇలాంటి పొరపాట్లు ఏమైనా చేశారేమో చూసి.. వాటిని సరిచేసుకోండి.

 

Also Read: టమాటా పొలంలో పనిచేస్తున్న రైతుకు ఇవి కనిపించాయ్.. ఏంటో తెలుసా..? 

Follow Us