భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి.. మహిళ పాలిట ఆపద్బాంధవుడైన రైల్వే పోలీస్..!

కళ్లముందే ఓ మహిళ మృత్యువుతో పోరాడుతోంది.. కాలు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయి ప్రాణభయంతో కేకలు వేస్తోంది.. క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయే ప్రమాదం! అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్ దేవుడిలా స్పందించారు. ప్రాణాలకు తెగించి రైలును ఆపించి, మహిళను మృత్యువు కోరల నుంచి కాపాడారు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి.. మహిళ పాలిట ఆపద్బాంధవుడైన రైల్వే పోలీస్..!
Rpf Constable Saves Woman

Updated on: Nov 10, 2026 | 12:01 PM

కిషన్‌గఢ్ (రాజస్థాన్): కళ్లముందే ఓ మహిళ మృత్యువుతో పోరాడుతోంది.. కాలు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయి ప్రాణభయంతో కేకలు వేస్తోంది.. క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయే ప్రమాదం! అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్ దేవుడిలా స్పందించారు. ప్రాణాలకు తెగించి రైలును ఆపించి, మహిళను మృత్యువు కోరల నుంచి కాపాడారు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫామ్‌కు, రైలు ఫుట్‌బోర్డుకు మధ్య కాలు ఇరుక్కుపోయి ఓ మహిళను రైలు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్ అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆమె ప్రాణాలను కాపాడారు.

జైపూర్‌-ఉదయ్‌పూర్ రైలు కిషన్‌గఢ్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో సోను కుమావత్ అనే మహిళ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ఆమె కాలు ప్లాట్‌ఫామ్‌కు, రైలు ఫుట్‌బోర్డుకు మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమె రైలుతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లబడుతూ కేకలు వేయడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిరంజన్ లాల్ పరిస్థితిని గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి పరుగెత్తారు. వెంటనే రైలును ఆపేలా చర్యలు తీసుకుని మహిళను ప్రమాదం నుంచి రక్షించారు. ఆయన చొరవతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో సర్గావ్ రోడ్‌, వార్డు నంబర్‌ 52కు చెందిన సోను కుమావత్‌కు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ ప్రాణాలను కాపాడిన నిరంజన్ లాల్ ధైర్యసాహసాలపై ప్రయాణికులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ఎంతటి ప్రమాదాన్నైనా నివారించగలవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us