Viral Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. పడగ విప్పిన పాములు.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా!

|

Feb 09, 2023 | 9:15 AM

ప్రస్తుతం యువత ఫ్యాషన్ ఐకాన్‌లుగా మారిపోతున్నారు. కొత్త కొత్త పుంతలు తొక్కుతోన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా తమ హెయిర్ స్టైల్ దగ్గర..

Viral Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. పడగ విప్పిన పాములు.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా!
Snakes Viral Video
Follow us on

ప్రస్తుతం యువత ఫ్యాషన్ ఐకాన్‌లుగా మారిపోతున్నారు. కొత్త కొత్త పుంతలు తొక్కుతోన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా తమ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి దుస్తులు, చెప్పుల వరకు.. ప్రతీ విషయంలోనూ అందరి దృష్టిని ఆకర్షించేలా తమ ఆహార్యాన్ని మార్చుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూస్ నుంచి పొడుచుకుని వచ్చిన ఆ పాములను చూసి నెటిజన్లు తెగ భయపడిపోయారు. కానీ తీరా దగ్గరకు వెళ్లి చూడగా అందరూ అవాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా జంతువుల చర్మంతో తయారయ్యే వస్తువులు, చెప్పులు గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి కొంచెం వెరైటీగా అలోచించాడు. ఏకంగా బూట్లను పాముల ఆకారంలో తీర్చిదిద్దాడు. అవి చూడటానికి ఎలా ఉన్నాయంటే..? పడగ విప్పిన పాముల తరహాలో కనిపిస్తాయి. వాటిని వేసుకుంటే కాళ్ల నుంచి పాములు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. అవి చూడటానికి నిజమైన పాముల వలె ఉండటంతో అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ బూట్లను వాడాలంటే.. చాలా ధైర్యం ఉండాలి బాసూ అని కొందరు కామెంట్ చేయగా.. ‘వామ్మో! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ.. అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.