Viral Video: గల్లీ క్రికెట్.. మెట్రో జర్నీతో.. ప్రిన్స్ విలియం, కేట్ సందడి!

సాధారణంగా  బ్రిటన్ రాజకుటుంబ సభ్యుల విదేశీ పర్యటనలో ఖరీదైన కార్లు, భారీ భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తాయి. కానీ ప్రిన్స్ విలియం, కేట్‌ ముంబైలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. లగ్జరీ కార్లను పక్కనపెట్టి ఏకంగా మెట్రో రైలు ఎక్కారు. అందులోనూ సాధారణ ప్రయాణికుల్లా కాసేపు ప్రయాణించారు. దీంతో ముంబై వాసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ రాజ దంపతుల మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: గల్లీ క్రికెట్.. మెట్రో జర్నీతో.. ప్రిన్స్ విలియం, కేట్ సందడి!
Prince William And Kate Hop On Mumbai Metro Instead Of Luxury Cars Video Goes Viral

Updated on: Nov 16, 2026 | 10:48 PM

సాధారణంగా  బ్రిటన్ రాజకుటుంబ సభ్యుల విదేశీ పర్యటనలో ఖరీదైన కార్లు, భారీ భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తాయి. కానీ ప్రిన్స్ విలియం, కేట్‌ ముంబైలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. లగ్జరీ కార్లను పక్కనపెట్టి ఏకంగా మెట్రో రైలు ఎక్కారు. అందులోనూ సాధారణ ప్రయాణికుల్లా కాసేపు ప్రయాణించారు. దీంతో ముంబై వాసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ రాజ దంపతుల మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మెట్రోలో ప్రిన్స్ విలియం, కేట్ సర్ ప్రైజ్

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరిన్ నవంబర్ 16న ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రయాణం కోసం వారు ముంబై మెట్రో ఆక్వా లైన్‌ను ఎంచుకున్నారు. విధాన్ భవన్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వరకు వెళ్లారు.

మెట్రోలో కూర్చున్న ఈ జంట ప్రయాణ సమయంలో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. వారిని అలా సాధారణ ప్రయాణికుల మధ్య చూడటంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆసక్తిగా షేర్ చేస్తున్నారు. రాజ దంపతులు మెట్రోలో ప్రయాణించడం ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

సచిన్‌తో క్రికెట్.. ప్రిన్స్ విలియం బ్యాటింగ్!

మెట్రో ప్రయాణానికి ముందు ఈ రాజ దంపతులు మరో ఆసక్తికర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. స్థానిక పాఠశాల విద్యార్థినులతో వీధిలో సరదాగా గడిపారు. తెల్లటి షర్ట్, నేవీ బ్లూ స్లీవ్‌లెస్ జాకెట్, నల్లటి ప్యాంట్‌లో కనిపించిన ప్రిన్స్ విలియం బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగారు.  ఐదు బాల్స్ ఎదుర్కొన్న ఆయన ఐదో బాల్ కు బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత బౌలింగ్ కూడా చేశారు. సచిన్ టెండూల్కర్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇవ్వడంతో విలియంకు వికెట్ దక్కింది. ఇక ప్రిన్సెస్ కేథరిన్ కూడా గల్లీ క్రికెట్ ఆడి విద్యార్థినులతో సందడి చేశారు. ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కలిసి బ్రిటన్ రాజ దంపతులు క్రికెట్ ఆడిన క్షణాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.

క్రికెట్ ఆటతో పాటు ముంబైలోని మరో ప్రత్యేక అనుభవాన్ని కూడా ఈ జంట ఆస్వాదించింది. అదే కట్టింగ్ చాయ్! బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఓ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌కు వెళ్లిన ప్రిన్స్ విలియం, కేథరిన్ సంప్రదాయ మట్టి కప్పుల్లో టీ తాగారు. ముంబై వీధుల్లో ఎంతో ప్రత్యేకమైన కట్టింగ్ చాయ్‌ను ఆస్వాదిస్తూ స్థానిక సంస్కృతిని దగ్గరగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి సంప్రదాయ ఢోల్-తాషా వాయిద్యాలతో స్వాగతం పలికారు. స్థానిక టీ వ్యాపారికి కూడా బ్రిటన్ రాజ దంపతులకు టీ అందించే అవకాశం లభించింది.

ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరిన్ మూడు రోజుల భారత పర్యటనలో ప్రధాన కార్యక్రమం 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్. పర్యావరణ సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనే వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రిన్స్ విలియం 2020లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ఈ అవార్డు ద్వారా ప్రోత్సాహం అందిస్తారు. ఈ ఏడాది ఐదు విభాగాల్లో 15 పర్యావరణ పరిష్కారాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో 20 మంది వ్యక్తులు భాగమయ్యారు.

నవంబర్ 18న ప్రధాని మోదీతో భేటీ

ముంబైలో పర్యటన ముగిసిన తర్వాత ఈ రాజ దంపతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 18న ప్రధాని  మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్-బ్రిటన్ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించే అవకాశం ఉంది.

గతంలో 2016 ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన ప్రిన్స్ విలియం, కేథరిన్‌కు ఇది రెండో అధికారిక భారత పర్యటన. అయితే ఈసారి ముంబైలో వారు చేసిన పనులు మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. సచిన్‌తో క్రికెట్ ఆడటం, కట్టింగ్ చాయ్ తాగడం, ఖరీదైన కార్లను వదిలి మెట్రోలో ప్రయాణించడం ముంబై వాసులను ఆశ్చర్యపరిచింది. ఈ రాజ దంపతుల ముంబై పర్యటన వీడియోలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us