రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్‌లో జీవించి ఉన్న బాక్టీరియా టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి?

సైబీరియాలోని ప్లేగ్‌ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువ ల్యాబ్‌ రీసెర్చర్‌ అనుమానాస్పదంగా చనిపోయింది. సెప్టెంబర్‌ 29న తీవ్ర నిమోనియా లక్షణాలతో ఆమెను షెలెఖోవ్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. రెండు రోజులకే దర్యా షిపిలోవా మృతి చెందింది. ప్లేగ్‌ బ్యాక్టీరియాతో నిండిన ఓ టెస్ట్‌ ట్యూబ్‌ ప్రమాదవశాత్తూ పగిలిపోయిందని యువతి డాక్టర్లకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె ప్రమాదకరమైన సూక్ష్మజీవికి గురైందనే అనుమానాలు మొదలయ్యాయి.

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్‌లో జీవించి ఉన్న బాక్టీరియా టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి?
Plague Outbreak In Russia Many Quarantined After Death Of Lab Researcher (1)

Updated on: Oct 05, 2026 | 10:21 AM

సైబీరియాలో న్యుమోనియాతో బాధపడుతూ 28 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఓ ప్లేగ్‌ వ్యాధి పరిశోధనా సంస్థలో పనిచేస్తుండటంతో.. ల్యాబ్‌లో లీకైన ప్రమాదకర ప్లేగ్ బాక్టీరియా కారణంగా చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెతో సంబంధం ఉన్న వందలాది మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని ఆసుపత్రుల్లో క్వారంటైన్‌ చేపట్టారు.

ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న యువ ల్యాబ్‌ రీసెర్చర్‌  న్యుమోనియా వ్యాధి సోకి చనిపోయింది. సెప్టెంబర్‌ 29న తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో ఆమెను షెలెఖోవ్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే రెండు రోజులకే దర్యా షిపిలోవా మృతి చెందింది. ప్లేగ్‌  బాక్టీరియాతో నిండిన ఓ టెస్ట్‌ ట్యూబ్‌ ప్రమాదవశాత్తూ పగిలిపోయిందని యువతి డాక్టర్లకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె ప్రమాదకరమైన సూక్ష్మజీవికి గురైందనే అనుమానాలు మొదలయ్యాయి.

వందల మందిపై నిఘా

పరిశోధకురాలితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ప్రారంభించారు.షెలెఖోవ్‌ ఆసుపత్రిలో దాదాపు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. మరో మూడు ఆసుపత్రుల్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పరిస్థితి అదుపులోనే ఉందని ఇర్కుట్స్క్‌ గవర్నర్‌ ఇగోర్‌ కోబ్జెవ్‌ తెలిపారు. గుర్తించిన కాంటాక్టులందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, వారిలో ఎవరికీ ఇప్పటివరకు లక్షణాలు కనిపించలేదని చెప్పారు. వారి ల్యాబ్‌ పరీక్షలు కూడా నెగెటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు.

ప్లేగు పరిశోధనా సంస్థ కావడంతో అనుమానాలు

ఈ ఘటన జరిగిన ప్రాంతమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు జరుపుతారు. అయితే ఇలాంటి ప్రయోగశాలల్లో పనిచేసే సిబ్బంది సాధారణంగా ప్రత్యేక రక్షణ పరికరాలు ఉపయోగిస్తారని రష్యా ఎపిడెమియాలజిస్ట్‌ మిఖాయిల్‌ ఫవొరోవ్‌ స్పష్టం చేసారు. టెస్ట్‌ ట్యూబ్‌ పగిలిన ఘటన కారణంగా చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఘటన వెనుక అసలు ఏం జరిగిందనే ప్రశ్నలు మరింత పెరిగాయి. కొందరు దీనిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు.  ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను ప్రచారం చేయవద్దని షెలెఖోవ్‌ మేయర్‌ మాక్సిమ్‌ మోడిన్‌ కోరారు.

న్యూమోనిక్ ప్లేగు ఎందుకు ప్రమాదం?

ప్లేగు వ్యాధికి కారణమయ్యే Yersinia pestis అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే మూడు ప్రధాన రూపాల్లో న్యూమోనిక్‌ ప్లేగు ఒకటి. సాధారణంగా ప్లేగు అంటే ఈగల ద్వారా వ్యాపించే బుబోనిక్‌ ప్లేగు గుర్తుకు వస్తుంది. కానీ న్యూమోనిక్‌ ప్లేగు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. బాధిత వ్యక్తి దగ్గు, తుమ్ము ద్వారా  ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. జ్వరం, తలనొప్పి, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర సందర్భాల్లో రక్తంతో కూడిన కఫం రావచ్చు. వ్యాధిని తొలిదశలో గుర్తించి సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే ప్లేగును నయం చేసే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us