అరుదైన ‘బ్రౌన్ జీబ్రా’.. ప్రపంచంలో ఇదే మొదటిది

| Edited By:

Apr 04, 2019 | 10:13 AM

జంతువులపై ఫొటోలను తీస్తున్న ఓ ఫొటోగ్రాఫర్‌కు అరుదైన బ్రౌన్ జీబ్రా కనిపించింది. దీంతో వెంటనే దాని ఫొటోను క్లిక్‌మనిపించాడు ఆ ఫొటోగ్రాఫర్. ఆ తరువాత ఆ జీబ్రా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ జాతికి సంబంధించి ప్రపంచంలో మొదట జీబ్రా ఇదే కావడం విశేషం. సెరెంగేటి జాతీయ పార్క్‌లో ఈ అరుదైన జీబ్రాను కనుగొన్నాడు సెర్గియో పిటంటిజ్ అనే ఫొటోగ్రాఫర్. పార్క్‌లో జంతువులపై ఫొటోలను తీస్తున్న సెర్గియా.. మొదట ఆ జీబ్రాను చూసి […]

అరుదైన ‘బ్రౌన్ జీబ్రా’.. ప్రపంచంలో ఇదే మొదటిది
Follow us on

జంతువులపై ఫొటోలను తీస్తున్న ఓ ఫొటోగ్రాఫర్‌కు అరుదైన బ్రౌన్ జీబ్రా కనిపించింది. దీంతో వెంటనే దాని ఫొటోను క్లిక్‌మనిపించాడు ఆ ఫొటోగ్రాఫర్. ఆ తరువాత ఆ జీబ్రా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ జాతికి సంబంధించి ప్రపంచంలో మొదట జీబ్రా ఇదే కావడం విశేషం.

సెరెంగేటి జాతీయ పార్క్‌లో ఈ అరుదైన జీబ్రాను కనుగొన్నాడు సెర్గియో పిటంటిజ్ అనే ఫొటోగ్రాఫర్. పార్క్‌లో జంతువులపై ఫొటోలను తీస్తున్న సెర్గియా.. మొదట ఆ జీబ్రాను చూసి అది బురదను పూసుకుందని అనుకున్నాడు. తరువాత తీక్షణంగా గమనించగా.. అరుదైన జీబ్రా అని తెలుసుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ జీబ్రాను తన కెమెరాలో బంధించాడు.

కాగా జీబ్రాల శరీరంలో మెలానిన్ తక్కువగా ఉండటం వలన వాటి చారల రంగు ఇలా మారుతుందని జంతు పరిశోధకులు చెబుతున్నారు. మిగిలిన జీబ్రాలతో పోలిస్తే వీటిపై దోమల దాడి ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. అయితే సాధారణ జీబ్రాలతో కలిసి ఇవి జీవనం సాగించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు స్పష్టం చేశారు.