Viral: గోడ నుంచి ఏదో వింత శబ్దం.. బద్దలకొట్టి చూడగా బయటపడ్డ నిధి.. ఇంతకీ అదేంటంటే.?

|

Apr 17, 2024 | 12:53 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కా

Viral: గోడ నుంచి ఏదో వింత శబ్దం.. బద్దలకొట్టి చూడగా బయటపడ్డ నిధి.. ఇంతకీ అదేంటంటే.?
Viral Photo
Follow us on

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన.. ఓ వ్యక్తికి వింత అనుభవాన్ని ఎదురయ్యేలా చేసింది. తన ఇంటి గోడలో నిధి దొరికిందని అనుకున్న సదరు వ్యక్తి.. అదేంటో తెలిశాక దెబ్బకు షాకయ్యాడు.

కాలిఫోర్నియాలో నివాసముంటున్న ఓ వ్యక్తి.. తన ఇంటి గోడ నుంచి ఏదో అలికిడి వినిపించడంతో.. స్థానికంగా ఉన్న పెస్ట్ కంట్రోల్ ఉద్యోగికి ఫోన్ చేశాడు. ఆ ఉద్యోగి సదరు వ్యక్తి ఇంటికి చేరుకోగానే.. ఆ గోడకు ఓ రంధ్రం ఉందని చూసి బిత్తరపోతాడు. ఓ వండ్రంగి పిట్ట.. ఆ గోడను తన ఆహారాన్ని దాచుకునే స్థలంగా మార్చుకుందని తెలిసి ఆశ్చర్యపోతారు. ఆ గోడ నిండా కుప్పలు తెప్పలుగా చెస్ట్ నట్ పళ్లు ఉన్నాయి. ఇక ఆ మొత్తం పళ్ల బరువు తెలిస్తే షాక్ అవుతారు. అది ఏకంగా 317 కిలోల బరువు ఉంది. దీనికి సంబంధించిన అంశాన్ని సదరు వ్యక్తి ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ పోస్ట్ మీరూ చూసేయండి.