Optical illusions: ఈ ఫొటోలో మనిషి ముఖం దాగుంది.. గుర్తుపట్టగలరా.? తలకిందులు తపస్సు చేస్తే తప్ప..

|

Aug 05, 2022 | 7:41 PM

Optical illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ సంబంధిత ఫొటోలు ఇటీవల బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. కేవలం కాలక్షేపానికి మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టేలా ఉండే ఈ ఇల్యూజన్స్‌ ఆసక్తిని పెంచుతున్నాయి. అందుకే నెటిజన్లు వీటికి...

Optical illusions: ఈ ఫొటోలో మనిషి ముఖం దాగుంది.. గుర్తుపట్టగలరా.? తలకిందులు తపస్సు చేస్తే తప్ప..
Follow us on

Optical illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ సంబంధిత ఫొటోలు ఇటీవల బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. కేవలం కాలక్షేపానికి మాత్రమే కాకుండా మెదడుకు మేత పెట్టేలా ఉండే ఈ ఇల్యూజన్స్‌ ఆసక్తిని పెంచుతున్నాయి. అందుకే నెటిజన్లు వీటికి బాగా ఆకర్షితులవుతున్నారు. ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన పజిల్స్‌ను సాల్వ్‌ చేస్తున్నారు. దీంతో క్రియేటర్స్‌ సైతం ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున పోస్ట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా సైట్స్‌లో ప్రత్యేకంగా పేజీలను క్రియేట్‌ చేసి మరీ.. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ తాలుకూ ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.

తాజాగా నెట్టింట ఇలాంటి ఓ ఫొటోనే వైరల్‌ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటో చూస్తుంటే ఏం కనిపిస్తోంది.? ఏముంది.. ఏడారిలో ఒంటె ఉందంటారా.? అయితే ఇక్కడే మీ మెదడుకు పని చెప్పాలి. ఈ ఫొటోలో ఒంటేతో పాటు ఓ మనిషి ముఖం కూడా ఉంది గమనించారా.. ఎంత తీక్షణంగా చూసినా కనిపించడం లేదు కదా, అంత సింపుల్‌గా కనిపిస్తే దానిని ఆప్టికల్‌ ఇల్యూషన్‌ అని ఎందుకు అంటారు. అయితే ఈ ఫొటోలో మాత్రం మనిషి ముఖం స్పష్టంగా ఉంది.

పైన పేర్కొన్న ‘ఈ ఫొటోలో మనిషి ముఖం దాగుంది.. గుర్తుపట్టగలరా.? తలకిందులు తపస్సు చేస్తే తప్ప’ అనే హెడ్డింగ్‌లోనే ఆన్సర్‌ దాగి ఉంది. ఓసారి ప్రయత్నించండి. ఇప్పటికీ ఆన్సర్‌ గుర్తించకపోతే ఒకసారి మీ ఫోన్‌ను తలకిందులు చేసి చూడండి. ఒంటె ముందు కాళ్ల పక్కన మనిషి ముఖం కనిపిస్తుంది. భలే ఉంది కదూ పజిల్‌. అసలు గుర్తుపట్టలేనంతలా ఫొటోను రూపొందించిన క్రియేటర్‌ ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరు కదూ.!

 

Optical Illusions 11

 

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..