Photo Puzzle: తస్సాదియ్య.. ఇది కదా పజిల్ అంటే.. చిరుతను కనిపెట్టండి చూద్దాం

|

Jul 18, 2024 | 12:45 PM

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత పజిల్స్‌కు సోషల్‌ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో మెదడుకు మేత పేట్టేవి కొన్ని అయితే, కళ్ల పవర్‌ను చెక్‌ చేసేవి మరికొన్ని. తాజాగా మీ కోసం ఓ క్రేజీ పజిల్ తీసుకొచ్చాం....

Photo Puzzle: తస్సాదియ్య.. ఇది కదా పజిల్ అంటే.. చిరుతను కనిపెట్టండి చూద్దాం
Find The Leopard
Follow us on

వచ్చేశాం.. మీ కోసం మస్త్ పజిల్ తెచ్చేశాం. ఇది కేవలం టైమ్ పాస్ కోసమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.  నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా… మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉంది..? అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయో ఈ పజిల్స్ చెప్పేస్తాయ్. వీటిని ఇప్పుడు చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ తరహా పజిల్స్ అందించేందుకు కొన్ని మీమ్ పేజీలు కూడా వర్క్ చేస్తున్నాయ్. తాజాగా  మీ ముందుకు తీసుకొచ్చిన పజిల్ పర్వత ప్రాంతానికి సంబంధించింది. అక్కడే ఓ చిరుత కూడా ఉంది. కొండల రంగులో ఆ చిరుత రంగు కలిసిపోవడంతో.. దాన్ని కనిపెట్టడం పెద్ద టాస్కే అని చెప్పాలి. మీవి డేగ కళ్లయితే.. క్షణాల వ్యవధిలోనే దాని పట్టేయగలరు.

ఏంటి కష్టం అనిపిస్తుందా..? ఎంత సేపు వెతికినా దాని ఆచూకి చిక్కడం లేదా..? అయ్యో వర్రీ అవ్వకండి.. సమాధానం ఉన్న ఫోటోను మేం దిగువన ఇస్తాం.. అయితే ఇంకోసారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫోకస్ పెట్టడం మర్చిపోకండి. ఎందకంటే.. ఇలాంటి ఛాలెంజులు స్వీకరిస్తేనే.. లైఫ్‌లో కూడా సవాళ్లను ఎదుర్కొనగలరు. దేన్నేనా చేధించుకుంటూ వెళ్లగలం అన్న యాటిట్యూడ్ మీలో ఉండాలి. లేదంటే.. చిన్న సమస్య ఎదురైనా బొక్కబోర్లాపడతారు. ఒకవేళ ఈ పజిల్ మీకు నచ్చిన… ఈ ఫొటోను మీ వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా సవాల్ విసరండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా ఆన్సర్ కనిపెడతారో.

Leopard

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..