Optical Illusion: దమ్ముంటే కాస్కో.. 25 సెకన్లలో ఈ ఫోటోలోని 1 టూ 25 నంబర్లను గుర్తిస్తే మీరే జీనియస్!

మీరు తెలివైనవారేనా? మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయా? మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ బాగున్నాయని అనుకుంటున్నారా? అయితే మీకో సవాల్! ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో తారుమారుగా ఉన్న 1 నుంచి 25 నంబర్లను 25 సెకన్లలో వరుస క్రమంలో గుర్తించండి. మీరు ఎంత సమయంలో గుర్తించారన్న దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌ను చెక్ చేసుకోండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. 25 సెకన్లలో ఈ ఫోటోలోని 1 టూ 25 నంబర్లను గుర్తిస్తే మీరే జీనియస్!
Optical Illusion

Updated on: Sep 13, 2026 | 11:55 AM

సోషల్ మీడియాలో అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ వంటివి మాత్రమే యూజర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి తెలివితేటలను సవాల్ చేస్తాయి. కాబట్టి చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా, ఆలోచనా శక్తి మరియు తెలివితేటలు పెరుగుతాయి.

మెదడు చురుకుదనానికి బ్రెయిన్ టీజర్స్

ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏదైనా చిత్రాన్ని చూసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకొని, విశ్లేషించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ మెదడును యాక్టివ్‌గా ఉంచడంతో పాటు, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ సహాయపడుతుంది. అందుకే సమయం దొరికినప్పుడల్లా చాలా మంది ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు.

మీ ముందున్న సవాల్ ఇదే!

మీరు కూడా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాల్వ్ చేసి మీ నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో మీకు 1 నుంచి 25 వరకు అంకెలు కనిపిస్తాయి. అయితే అవి వరుస క్రమంలో కాకుండా తారుమారై ఉంటాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. 25 సెకన్లలో 1 నుంచి 25 వరకు ఉన్న నంబర్లను వరుస క్రమంలో కనిపెట్టాలి. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే, మీ సమయం ఇప్పుడే మొదలైంది!

మీరు నెంబర్స్ కనిపెట్టిన సమయాన్ని బట్టి మీ తెలివి అంచనా!

25 సెకన్లలో 25 గుర్తిస్తే: నిర్ణీత 25 సెకన్ల వ్యవధిలోనే అన్ని అంకెలను కరెక్ట్‌గా గుర్తిస్తే.. కంగ్రాట్స్! మీ పరిశీలనా శక్తి, కంటి చూపు చాలా షార్ప్‌గా ఉన్నాయని అర్థం.

25 సెకన్లలో 20 గుర్తిస్తే: ఇచ్చిన సమయంలో 20 అంకెల వరకు మాత్రమే గుర్తించగలిగితే పెద్దగా నిరాశ చెందాల్సిన పనిలేదు. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగున్నట్లే. కాస్త సాధన చేస్తే మరింత మెరుగవుతారు.

25 సెకన్లలో 15 గుర్తిస్తే: ఒకవేళ 15 అంకెలు మాత్రమే గుర్తించగలిగితే, మీ పరిశీలనా శక్తి సాధారణంగా ఉందని, ఏకాగ్రతను మరింత పెంచుకోవాల్సి ఉందని అర్థం. క్రమం తప్పకుండా ఇలాంటి పజిల్స్ ప్రాక్టీస్ చేస్తే సులభంగా వేగం పెంచుకోవచ్చు.

ఈ పజిల్ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే, మీ స్నేహితుల ఐక్యూని కూడా టెస్ట్ చేయడానికి ఈ ఆర్టికల్‌ను వారితో షేర్ చేసుకోండి!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us