బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి అవాక్కయిన ఫ్యామిలీ మెంబర్స్

జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులను ఎవరూ సులభంగా ఖర్చు చేయరు. అందులో నుంచి రూపాయి తీయాలన్నా వందసార్లు ఆలోచిస్తారు. కానీ, చైనాకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు మాత్రం తన జీవిత కాలపు పొదుపు మొత్తాన్ని బ్యూటీ పార్లర్‌లో తగలేసింది.  భారీ బిల్లును చూసి ఆమె కూతురు షాక్ అయింది. అవసరం లేకున్నా సర్వీసుల పేరుతో తన తల్లిని నిలువు దోపిడీ చేసారని కన్నీరుమున్నీరవుతోంది. 

బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి అవాక్కయిన ఫ్యామిలీ మెంబర్స్
Old Woman Spends Rs Four Crore Savings At Beauty Salon

Updated on: Sep 16, 2026 | 2:54 PM

వయసు మీద పడినప్పటికీ యవ్వనంగా కనిపించాలనే ఆశతో ఒక బామ్మ బ్యూటీ పార్లర్‌లో భారీగా ఖర్చు పెట్టింది.  వివిధ రకాల ట్రీట్‌మెంట్లు, కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకున్న ఆ బామ్మకు చివరకు ఏకంగా రూ. 4 కోట్ల బిల్లు రావడంతో కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా మైండ్ బ్లాకై షాక్‌కు గురయ్యారు.   పార్లర్ లో ఆమె చేయించుకున్న సేవల వివరాల గురించి కూతురు వాకబు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

చైనాలోని షాంఘైకి చెందిన ‘యూ’ అనే బామ్మ వృద్ధాప్యంలో యోంగ్‌చీ బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయించింది. యంగ్‌గా కనిపించాలన్న ఆశతో స్కిన్ టైటెనింగ్, థ్రెడ్ లిఫ్ట్స్, ఐబ్రో అండ్ లిప్ టాటూయింగ్ లాంటి ట్రీట్‌మెంట్లు తీసుకుని ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు పెట్టింది. బిల్లు చూసి షాకైన ఆమె కూతురు.. బ్యూటీ పార్లర్ వాళ్ళు తన తల్లిని నిలువునా దోచుకున్నారని మండిపడింది. మార్కెట్ రేట్లకంటే చాలా ఎక్కువ వసూలు చేశారని, ఒక్క లిప్ టాటూకే ఏకంగా రూ. 5.6 లక్షలు లాగేశారని వాపోయింది. అసలు చేయని ట్రీట్‌మెంట్‌లకు కూడా బిల్లులు వేయడమే కాకుండా, అవసరం లేకపోయినా ఒకే ట్రీట్‌మెంట్‌ను రిపీట్ చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

యోంగ్‌చీ కంపెనీ వాళ్లు ఆ బామ్మను ‘రూయి’ అనే మరో బ్యూటీ క్లినిక్‌కి పంపించారని, అక్కడ మరింత దోపిడీ జరిగిందని కూతురు ఆరోపించింది. అసలు ‘ఇంటిమేట్ కేర్’ అనే సర్వీసే చేయకపోయినా, చేసినట్లు నటించి ఏకంగా రూ. 42 లక్షలు వసూలు చేశారని వాపోయింది.  ఎక్కడా ఎన్నడూ వినని విధంగా ‘హ్యాపీనెస్ చైర్’, ‘స్పేస్ క్యాప్సూల్స్’ అంటూ ఇష్టానుసారంగా పేర్లు పెట్టి లక్షల రూపాయలు గుంజేశారని మండిపడింది.

చిల్లిగవ్వ కూడా మిగల్చలేదు

 


ఇలా నిలువునా దోచుకోవడంతో తన తల్లి దగ్గర కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా చిల్లిగవ్వ మిగల్లేదని కూతురు కన్నీటిపర్యంతమైంది.  వయసు మీద పడుతుందనే ఆమె ఆందోళనను, భయాన్ని ఆసరాగా చేసుకుని ఆ బ్యూటీ పార్లర్లు ఆ బామ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేశాయని మండిపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us