Corona Warriors : న‌ర్సుపై పూల వ‌ర్షం…క‌న్నీళ్లతో బావోద్వేగం

| Edited By: Anil kumar poka

May 02, 2020 | 2:14 PM

కరోనా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు.. ఆమడదూరం పారిపోతున్నారు. ఈ వైరస్‌ దెబ్బకు ప్రపంచదేశాలే గజగజమని వణికిపోతున్నాయి. ఇక కరోనా బాధితులు కనిపిస్తే వామ్మో అని అక్కడ్నుంచి పారిపోతాం.. ఎందుకంటే అది మనకు ఎక్కడసోకుతుందోనన్న భయం.. అందుకే వైరస్‌ సోకిన బాధితులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం.. అయితే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు అహర్నిశలు కరోనా నియంత్రణ కోసం కష్టపడుతున్నారు. తమ కుటుంబాన్ని పక్కన పెట్టి కరోనా బారిన […]

Corona Warriors : న‌ర్సుపై పూల వ‌ర్షం...క‌న్నీళ్లతో బావోద్వేగం
Follow us on

కరోనా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు.. ఆమడదూరం పారిపోతున్నారు. ఈ వైరస్‌ దెబ్బకు ప్రపంచదేశాలే గజగజమని వణికిపోతున్నాయి. ఇక కరోనా బాధితులు కనిపిస్తే వామ్మో అని అక్కడ్నుంచి పారిపోతాం.. ఎందుకంటే అది మనకు ఎక్కడసోకుతుందోనన్న భయం.. అందుకే వైరస్‌ సోకిన బాధితులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం.. అయితే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు అహర్నిశలు కరోనా నియంత్రణ కోసం కష్టపడుతున్నారు. తమ కుటుంబాన్ని పక్కన పెట్టి కరోనా బారిన పడిన అనేకమందికి సేవలు అందిస్తున్నారు. వారిలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలపాటు హాస్పిటల్స్‌లోనే ఉంటూ సేవలు చేస్తున్నారు. నిస్వార్థంతో పని చేస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్న ఇలాంటి వారిని ప్రజలు అస‌లైన హీరోలుగా కీర్తిస్తున్నారు. వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది.

పూణెకు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త భర్త, పిల్లలకు దూరంగా ఉంటూ ఆసుపత్రిలో కోవిడ్‌ 19 బాధితులకు సేవలందించారు. ఐసీయూలో చేరిన కరోనా బాధితులకు చికిత్స చేస్తూ 20 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చారు. ఇంటి దగ్గర అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ ఘన స్వాగతం పలికారు. నిజమైన కథానాయక అంటూ పూలవర్షం కురిపించారు. ఇప్పుడు ఈ వీడియోను ప్రధానమంత్రి మోదీ కూడా ట్వీట్‌ చేశారు. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయని, ఇది భారతదేశపు ఆత్మ అని, మనం ధైర్యంగా కరోనాతో పోరాడుతున్నామని, ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణమని ప్రధాని మోదీ ట్విటర్‌లో తెలిపారు.