వామ్మో..! నిమ్మకాయ కిలో రూ.850, టమాటా రూ.680.. కూరగాయాలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలా?

నార్వేలో కూరగాయల ధరలు భారత్‌తో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువని ఓ వైరల్ వీడియో వెల్లడించింది. కిలో నిమ్మకాయలు రూ.850, టమాటాలు రూ.680 పలుకుతుండగా, భారత్‌లో అవి ఎంతో తక్కువ. ఈ ధరల వ్యత్యాసం నార్వే జీవన వ్యయం, భారత్ రైతులకు లభించే ధర, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీసింది. వినియోగదారుల ఖర్చులు, రైతుల ఆదాయంపై కీలక ప్రశ్నలు రేకెత్తించింది.

వామ్మో..! నిమ్మకాయ కిలో రూ.850, టమాటా రూ.680.. కూరగాయాలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలా?
Norway Vegetable Prices

Updated on: Sep 30, 2026 | 12:17 PM

విదేశాల్లో కూరగాయల ధరలు, భారత్‌లో వాటి ధరల మధ్య వ్యత్యాసం మరోసారి చర్చకు దారితీసింది. నార్వేలో నివసిస్తున్న ఓ భారతీయుడు అక్కడి కూరగాయల ధరలను చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నార్వేలో రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని కూరగాయలకు భారీ ధరలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వినోద్ అనే సోషల్ మీడియా యూజర్ Xలో షేర్ చేసిన వీడియోలో ఆర్గానిక్ నిమ్మకాయలు కిలోకు సుమారు రూ.850గా, టమాటాలు కిలోకు దాదాపు రూ.680గా ఉన్నట్లు చూపించారు. ఇక ఒక్క దోసకాయ ధర సుమారు రూ.300 వరకు ఉందని తెలిపారు. నార్వేలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ, ప్రతిసారీ దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడి ధరలు తనను ఆశ్చర్యపరుస్తున్నాని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో భారత్‌లోని మెట్రో నగరాల్లో సాధారణంగా నిమ్మకాయలు కిలోకు రూ.90-110, టమాటాలు రూ.60-80, దోసకాయలు ఒక్కొక్కటి రూ.20-30 వరకు లభిస్తాయని ఆయన పోల్చారు. అయితే ధరలు ప్రాంతం, నాణ్యత, సీజన్‌ను బట్టి మారవచ్చని తెలిపారు. భారత్‌తో పోలిస్తే నార్వేలో కూరగాయల ధరలు దాదాపు ఎనిమిది రెట్లు అధికంగా ఉన్నాయని వినోద్ పేర్కొన్నారు. అయితే అక్కడి జీతాలు కూడా అదే స్థాయిలో ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండవని అన్నారు. ఈ ధరల వ్యత్యాసం కేవలం నార్వేలోని జీవన వ్యయం, జీతాలు, దిగుమతుల అంశంతో మాత్రమే ముడిపడి లేదని, భారత్‌లో రైతులకు వారి ఉత్పత్తికి తగిన ధర లభిస్తుందా అనే ప్రశ్నను కూడా ఇది లేవనెత్తుతోందని అభిప్రాయపడ్డారు.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. కొందరు భారత రైతులకు తగిన ధర లభించడం లేదని, వినియోగదారులు చెల్లించే ధరలో రైతు వాటా ఎంత అని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం కేవలం కూరగాయల ధరలతో రెండు దేశాల జీవన ప్రమాణాలను పోల్చడం సరైన పద్ధతి కాదని, తలసరి ఆదాయం, ఆదాయ పంపిణీ, కొనుగోలు శక్తి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో నార్వే–భారత్ కూరగాయల ధరల పోలిక కాస్తా రైతుల ఆదాయం, వినియోగదారుల ఖర్చులు, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థపై ఆన్‌లైన్ చర్చకు దారితీసింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us