నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.. ఎందుకింత డిమాండో తెల్సా?

|

Mar 28, 2024 | 7:43 PM

నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్‌ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్‌లో డిమాండ్‌ ఎక్కువే ఉంటుంది. ఎండలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా మండుతుంటాయి. ఒక్క నిమ్మకాయ ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇలాంటప్పుడు సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటే..

నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.. ఎందుకింత డిమాండో తెల్సా?
Lemons
Follow us on

నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్‌ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్‌లో డిమాండ్‌ ఎక్కువే ఉంటుంది. ఎండలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా మండుతుంటాయి. ఒక్క నిమ్మకాయ ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇలాంటప్పుడు సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటే వెనకడుగు వేస్తారు. మరి అలాంటిది ఒక నిమ్మకాయ ఏకంగా 50 వేల రూపాయల ధర పలికిందంటే నమ్ముతారా? నమ్మాలి.. ఎందుకంటే ఆ నిమ్మకాయ అంత ప్రత్యేకమైనది మరి. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. సంతానం కోరుకునే దంపతులు ఈ నిమ్మకాయలను స్వీకరించడంద్వారా వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో ఈ ఏడాది పండుగ సందర్భంగా తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున బల్లెముపై ఉన్న నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తారు.

ఈ నిమ్మకాయను ఈ సంవత్సరం ఒక జంట రూ.50,500 కి కొనుగోలు చేశారు. ఆ తరువాత కూడా 9 రోజులు ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను ఉంచి పూజిస్తారు. కేవలం బిడ్డలను కనాలని చూస్తున్న వారు మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడతారని స్థానికులు చెబుతారు. దేవాలయాల్లోని నిమ్మకాలయలను భారీ ధరకు వేలంలో విక్రయించడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కూడా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో టెంపుల్ ఫెస్ట్‌లో భాగంగా ఒక నిమ్మకాయను 7600 రూపాయలకు విక్రయించారు.