
దుబాయ్ మాన ఘటన గురించి విస్తుపోయే వార్త రాగానే కెప్టెన్ స్మిత్ మచ్చర్ బిల్టింగ్ లోని కొందరు కెప్టెన్ భార్యకు మెసేజ్‌లు పంపారు. ‘మీరు బాగున్నారా? ఏదైనా సహాయం కావాలా?’ అంటూ అడిగారు. ఆ సమయంలో ఆమె సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చాలా ప్రశాంతంగా స్పందించి తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అందరూ చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు చెప్పి తన భర్త బాగానే ఉన్నారని ధైర్యం చెప్పారట.
స్మిత్ మచ్చర్ నివసిస్తున్న బిల్డింగ్ లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్తి శర్మ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ కథలో మరో హీరోయిజం కూడా ఉందనీ అది కెమెరాలకు కనిపించదు వార్తల్లో వినిపించదు. భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసినా ఆందోళనలో ఉన్న పొరుగువారికి ధైర్యం చెప్పిన భార్య నిశ్శబ్ద బలమే హీరోయిజం అనీ తెలిపారు. విమానంలో భర్త ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇంటి దగ్గర ఆయన కోసం కుటుంబం ఎదురుచూస్తోంది. అందుకే ఓ హీరోకు లభించే గౌరవం అతడి వెనుక నిలబడి, భయాన్ని ఆందోళనను భరిస్తూ, అతను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించే కుటుంబానికీ చెందుతుందని ఆమె పోస్టులో రాసుకొచ్చారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆసుపత్రికి వెళ్లి కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం మచ్చర్‌ను ఆలింగనం చేసుకున్నారు. పైలట్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దేశ నాయకత్వం తరఫున మచ్చర్‌కు పూర్తి గౌరవం, ప్రశంసలు అందిస్తున్నట్లు తెలిపారు.
Dubai Crown Prince Meets Hero Flydubai Pilot Smit Machchhar
విమానం కాక్‌పిట్‌లో దాడి షాకింగ్ వార్త విన్న వెంటనే ఇంట్లో దీపం వెలిగించామని స్మిత్ మచ్చర్ తండ్రి భూపేంద్ర మచ్చర్ ఆందోళనకర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘ ఏం జరిగినా చెడు వార్త మాత్రం రాకూడదు దయచేసి నా కొడుకును కాపాడు దేవుడా ‘ అంటూ ప్రార్థించామని ఎన్ డీటీవీ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురయ్యారు. 17 ఏళ్ల అనుభవం ఉన్న స్మిత్ మచ్చర్ వందలాది మంది పైలట్లకు మార్గనిర్దేశం చేసాడనీ చెప్పారు. రెండు చేతులకు తీవ్ర గాయాలు కాగా, తలకు శస్త్రచికిత్స జరిగిందనీ కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కెప్టెన్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితిపై UAEలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్మిత్ మచ్చర్ చికిత్సకు స్పందిస్తూ క్రమంగా కోలుకుంటున్నారని ప్రకటించింది.