హారన్ మోతను ఇలా తగ్గించండి.. ఆనంద్ మహీంద్రకు లేఖ రాసిన చిన్నారి

| Edited By:

Apr 05, 2019 | 5:47 PM

ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా రోడ్డుపై వెళుతున్నప్పుడు అవసరం లేకపోయినా కొంతమంది పదే పదే హారన్ కొడుతూ ఉంటారు. ఈ హారన్ మోతతో విసుగెత్తిపోయిన ఓ 11 ఏళ్ల బాలిక దీన్ని తగ్గించడానికి ఉపాయం ఆలోచించింది. తన ఆలోచనను ఓ లేఖలో రాసి మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు పంపింది. దాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ముంబయికి చెందిన మహికా మిశ్రా అనే ఓ బాలిక మహీంద్రకు లేఖ […]

హారన్ మోతను ఇలా తగ్గించండి.. ఆనంద్ మహీంద్రకు లేఖ రాసిన చిన్నారి
Follow us on

ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా రోడ్డుపై వెళుతున్నప్పుడు అవసరం లేకపోయినా కొంతమంది పదే పదే హారన్ కొడుతూ ఉంటారు. ఈ హారన్ మోతతో విసుగెత్తిపోయిన ఓ 11 ఏళ్ల బాలిక దీన్ని తగ్గించడానికి ఉపాయం ఆలోచించింది. తన ఆలోచనను ఓ లేఖలో రాసి మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు పంపింది. దాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ముంబయికి చెందిన మహికా మిశ్రా అనే ఓ బాలిక మహీంద్రకు లేఖ రాసింది. అందులో.. ‘‘డియర్ మిస్టర్ ఆనంద్ మహీంద్ర.. నా పేరు మహికా మిశ్రా. నా వయసు 11 ఏళ్లు. నేను ఏడో తరగతి చదువుతున్నా. నేను ముంబయిలో ఉంటా. నాకు కార్లు అన్నా.. అందులో దూరప్రదేశాలకు వెళ్లాలన్నా చాలా ఇష్టం.

బయటకు వెళ్లినప్పుడు చాలా మంది కావాలనే హారన్‌ను మోగిస్తుండటం నేను గమనించా. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కొంతమంది హారన్‌ను ఎక్కువగా మోగిస్తుంటారు. దాన్ని మోగించినంత మాత్రాన ఆ వాహనాలు ముందుకు కదలవని వారికి కూడా తెలుసు. అది వారి శక్తిని తగ్గిస్తుంది. అంతేకాదు దాని వలన శబ్ద కాలుష్యం కూడా పెరుగుతుంది. అందుకే నాకో ఉపాయం తట్టింది. 10నిమిషాల్లో 5సార్లు మాత్రమే హారన్ కొట్టేలా వాహనాల్లో ఏర్పాటు చేయాలి. అది కూడా ఆ హారన్ 3 సెకన్లు మాత్రమే మోగాలి. ఇలా చేయడం వలన శబ్ద కాలుష్యం తగ్గుతుంది. రోడ్లు ప్రశాంతంగా ఉంటాయి. మీ కంపెనీ తయారుచేసే కార్లలో నా ఆలోచనను ఉపయోగిస్తే బావుంటుందని అనుకుంటున్నా. అలాగే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలని కోరుతున్నా. నేను పెద్దయ్యాక ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవాలని కోరుకుంటున్నా’’ అంటూ పేర్కొంది.

దాన్ని షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర.. ‘‘బాగా అలసిపోయిన రోజు, ఇలాంటి లేఖను చూడటం వలన అలసత్వం అంతా ఇట్టే పోతుంది. ప్రశాంతమైన ప్రపంచాన్ని కోరుకునే ఇలాంటి వారి కోసమే నేను పనిచేస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.