ఆ చెట్టును తాకితే రోగాలు మాయం.. అడవి బాట పట్టిన రోగులు!

| Edited By:

Nov 08, 2019 | 3:42 PM

ఆస్పత్రుల చుట్టూ తిరిగినా రోగాలు తగ్గని వాళ్లు ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టారు. అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ వేల మంది అక్కడికి వెళ్తున్నారు. స్థానికంగా ఉండే […]

ఆ చెట్టును తాకితే రోగాలు మాయం.. అడవి బాట పట్టిన రోగులు!
Follow us on

ఆస్పత్రుల చుట్టూ తిరిగినా రోగాలు తగ్గని వాళ్లు ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టారు. అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ వేల మంది అక్కడికి వెళ్తున్నారు.

స్థానికంగా ఉండే రూప్ సింగ్ ఠాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. ‘‘కుంటుతూ నడిచే నేను.. ఓ రోజు పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. తర్వాత నాలో ఏదో మార్పును వచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకున్నాననిపించింది. ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా’’నని ఆ రైతు మాట్లాడిన వీడియా బయటకు రావడంతో.. అక్కడికి పేషెంట్ల తాకిడి పెరిగింది.

ఆ చెట్టును తాకడం ద్వారా తనకు రోగం తగ్గిపోయిందని ఓ పేషెంట్ కూడా చెప్పడంతో.. రోగాలను తగ్గించుకోవడం కోసం కొందరు వీల్ చైర్లలోనూ అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడు. రోజూ వేలాదిగా తరలి వస్తున్న వారికి రోగాలు ఏమాత్రం తగ్గాయో తెలీదు కానీ.. స్థానికంగా వ్యాపారం మాత్రం పెరిగిపోయింది. మినరల్ వాటర్, స్నాక్స్, కొబ్బరి బోండాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసమే చెట్టు గురించి ఈ ప్రచారం చేశారని అధికారులు చెబుతున్నారు.