Viral Video: వృద్దుడిని కుర్చీకి చుట్టేసి 4 గంటల పాటు నరకం చూపించిన నాగు పాము.. ఇదిగో వీడియో!

ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎటు నుంచి వచ్చిందో తెలీదు కానీ పక్షవాతంలో మంచానికే పరిమితమైన ఒక వృద్ధుడి చేతికి ఓ నాగుపాము చుట్టుకుంది. అది గమనించిన ఆ వృద్దుడు ప్రాణాలు చేతిలో పట్టుకొని అలాగే కుర్చీకి బిగుసుకుపోయాడు. దాదాపు 4 గంటల పాటు అతన్ని వీడకుండా ఆ పాముకు వృద్దుడికి నరకం చూపించింది. చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.

Viral Video: వృద్దుడిని కుర్చీకి చుట్టేసి 4 గంటల పాటు నరకం చూపించిన నాగు పాము.. ఇదిగో వీడియో!
Odisha Snake Incident Video

Updated on: May 31, 2026 | 6:00 PM

పక్షవాతంతో బాధపడుతున్న ఓ వ్యక్తు కూర్చుకున్న ఛైర్‌కు, అతని చేతికి ఓ నాగుపాము చుట్టుకుని అతని నరకం చూపించిన ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బౌధ్ జిల్లా హరభంగా బ్లాక్‌ పరిధిలోని అదినిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు అనే వృద్ధుడు పక్షవాతం కారణంగా గత కొంతకాలంగా మంచంపైనే ఉంటున్నారు. రోజువారీ లాగే ఆయన రాత్రి వేళ గదిలో నిద్రిస్తుండగా, కిటికీ తెరిచి ఉండటంతో ఒక నాగు పాము ఇంట్లోకి వచ్చింది.

కాసేపటికే పాము సాహు నిద్రిస్తున్న మంచంపైకి పాకి, ఆయన శరీరంపైకి చేరింది. తన శరీరంపై ఏదో కదులుతోందని సాహు గుర్తించినప్పటికీ, పక్షవాతం కారణంగా ఆయన త్వరగా స్పందించలేకపోయాడు. కాసేపటికి తేరుకొని ఆ పాము నుంచి తప్పించుకునేందుకు అతను కాస్తా కదిలాడు.. దీంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఆ పాము ఆ వృద్దిడి ఒక చేతికి గట్టిగా చుట్టుకోవడమే పక్కనే ఉన్న కుర్చీకి కూడా చుట్టుకుంది. దీంతో అతను కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఏ చిన్న కదలిక వచ్చినా పాము కాటు వేస్తుందనే భయంతో అతను ఊపిరి బిగబట్టి, గంటల తరబడి అలాగే ఉండిపోయాడు.

ఉదయాన్నే గదిలోకి వచ్చిన కుటుంబ సభ్యులు సాహు చేతికి, కుర్చీకి పాము గట్టిగా చుట్టుకుని ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అయితే ఇక్కడ వాళ్ల వారి సమయ స్పూర్తికి మెచ్చుకోవాలి. తొందరపడి పామును కొట్టడం వంటివి చేయకుండా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జాగ్రత్తగా పాము అతన్ని కాటు వేయడంగా దాన్ని విడిపించాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చకున్నారు.

వీడియో చూడండి..

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే.. నాలుగు గంటల పాటు అతన్ని చుట్టుకునే ఉన్న పాములు ఆ వ్యక్తిని కాటేయక పోవడం అద్భుతం అంటున్నారు. ఇప్పుడు స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us