హోటల్‌ రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్న గెస్ట్‌.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి..! భయానక వీడియో వైరల్‌

మనం ఎక్కడికైనా టూర్ వెళ్లినప్పుడు హాయిగా హోటల్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటుంటాం. కానీ, మీరు ఉన్న రూమ్ తలుపులు బద్దలు కొట్టుకుని ఒక భారీ ఎలుగుబంటి లోపలికి వస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదా! సరిగ్గా ఇలాంటి ఒక భీతి గొలిపే సంఘటనే టిబెట్‌లోని ఒక హోటల్‌లో జరిగింది. ఒక పెద్ద టిబెటన్ బ్రౌన్ బేర్ హోటల్ రూమ్‌లోకి చొరబడి అక్కడ ఉన్న పర్యాటకడిని భయభ్రాంతులకు గురిచేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హోటల్‌ రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్న గెస్ట్‌.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి..! భయానక వీడియో వైరల్‌
Bear In Hotel Room

Updated on: Jul 07, 2026 | 11:59 AM

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ విచిత్రమైన, భయానక ఘటన టిబెట్‌లోని నగ్చు నగరంలో ఉన్న ఒక హోటల్‌లో చోటుచేసుకుంది. ఆహారం, నీటి కోసం అడవి నుంచి నగరంలోకి వచ్చిన ఒక ఎలుగుబంటి నేరుగా హోటల్ మెయిన్ గేట్ గుండా లోపలికి ప్రవేశించింది. మొదట రిసెప్షన్ కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వాటర్ బాటిళ్లను పగలగొట్టి నీళ్లు తాగింది. ఆ తర్వాత మెట్ల గుండా రెండో అంతస్తుకు చేరుకుంది. అక్కడ లాబీలో తిరుగుతూ ఒక రూమ్ తలుపును తన భారీ పంజాలతో బలంగా నెట్టింది. ఆ గదిలో అప్పటికే ఒక గెస్ట్ ఉన్నాడు. తలుపు తెరవగానే లోపల ఉన్న వ్యక్తి, ఆ ఎలుగుబంటి కొన్ని సెకన్ల పాటు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వ్యక్తి భయంతో అచేతనంగా ఉండిపోయాడు. ఎలుగుబంటి గదిలోకి అడుగుపెట్టే లోపే హోటల్ యజమాని సమయస్ఫూర్తితో స్పందించాడు.

హోటల్ లోపలికి ఎలుగుబంటి వచ్చిందని గమనించిన యజమాని, వెంటనే చేతిలో ఒక పెద్ద టార్చ్ లైట్, శబ్దం చేసే కొన్ని వస్తువులను తీసుకుని పై అంతస్తుకు పరిగెత్తాడు. ఎలుగుబంటిపైకి టార్చ్ లైట్ వెలుతురును వేస్తూ, పెద్దగా అరుస్తూ దానిని భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ కాంతికి, శబ్దానికి భయపడిన ఎలుగుబంటి రూమ్ లోపలికి వెళ్లకుండా వెనక్కి తిరిగి, హోటల్ నుండి బయటకు పరుగులు తీసింది. ఈ తృటిలో తప్పిన ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటన తర్వాత హోటల్ యాజమాన్యం తమ భద్రతను మరింత కఠినతరం చేసింది. ఎలుగుబంట్లు రాకుండా ప్రత్యేకమైన బేర్-ప్రూఫ్ లాక్‌లను తలుపులకు అమర్చారు. టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సుమారు 6,300 వరకు బ్రౌన్ బేర్స్ ఉన్నాయని, ఇవి తరచూ ఆహారం కోసం మానవ నివాసాలపై దాడి చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ భయానక వీడియోను చూసిన నెటిజన్లు ఆ హోటల్ గెస్ట్ అదృష్టవంతుడని, యజమాని ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us