దూరదర్శన్ ట్యూన్‌కు స్టెప్పులేసిన యువకుడు… వైరల్ గా మారిన వీడియో

| Edited By:

Mar 09, 2019 | 9:08 PM

టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి ఈ ఆప్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ ద్వారా వైశాక్ నాయర్ అనే యువకుడు పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడో 1990కు సంబంధించిన […]

దూరదర్శన్ ట్యూన్‌కు స్టెప్పులేసిన యువకుడు... వైరల్ గా మారిన వీడియో
Follow us on

టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి ఈ ఆప్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ ద్వారా వైశాక్ నాయర్ అనే యువకుడు పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడో 1990కు సంబంధించిన దూరదర్శన్ ట్యూన్ కు అనుగుణంగా డాన్స్ స్టెప్పులు వేసి వీడియో అప్ లోడ్ చేశాడు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. 5వేల మంది ఈ వీడియోను తమ ట్విట్టర్ ఎకౌంట్లలో షేర్ చేశారు. వైశాక్‌ నాయర్‌ను ప్రశంసిస్తూ..ఈ వీడియోను దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఐఏఎస్‌) సుప్రియా సాహు ట్విట్టర్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.