Viral News: ముక్కుదిబ్బడే అనుకుని హాస్పిటల్‌కు వెళ్లగా.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్!

|

Feb 24, 2022 | 8:43 PM

మీరు ఎన్నో విచిత్రమైన సంఘటనల గురించి సోషల్ మీడియాలో వినే ఉంటారు. వాటిని మొదటిసారి చూసిన తర్వాత అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది...

Viral News: ముక్కుదిబ్బడే అనుకుని హాస్పిటల్‌కు వెళ్లగా.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్!
Viral
Follow us on

మీరు ఎన్నో విచిత్రమైన సంఘటనల గురించి సోషల్ మీడియాలో వినే ఉంటారు. వాటిని మొదటిసారి చూసిన తర్వాత అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. మేము ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటిదే. ఓ వ్యక్తి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. ముక్కుదిబ్బడ అయ్యి ఉంటుందిలే అని అనుకున్నాడు. కానీ అది ఎన్ని రోజులైనా తగ్గలేదు. చివరికి డాక్టర్లను సంప్రదించాడు. అనంతరం అతడ్ని స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంతేకాదు ఆ వ్యక్తి కూడా షాక్‌కు గురయ్యాడు. అసలు విషయం ఏంటో తెలియాలంటే.. ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే.!

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. మొదట్లో ముక్కుదిబ్బడ అయ్యి ఉంటుందిలే అని అశ్రద్ధ చేసినా.. ఎంతగానూ తగ్గకపోయేసరికి హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. ఇక ఆ స్కాన్ రిపోర్ట్స్‌ చూసి వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దానికి కారణం లేకపోలేదు. ఆ వ్యక్తి ముక్కు రంధ్రాలలో దంతం పెరుగుతోంది.

అసలు ఇది ఎలా జరిగిందని డాక్టర్లు కేసును క్షుణ్ణంగా పరిశీలించగా.. అది ఎక్టోపిక్ దంతం అని నిర్ధారణకు వచ్చారు. వైద్య భాషలో ఎక్టోపిక్ అంటే.. అసాధారణంగా పెరగడం అని అర్ధం. కొంతమందికి ఎగుడుదిగుడు పళ్ళు ఎలా ఉంటాయో.. ఇతడికి ఏకంగా దంతం ముక్కు రంధ్రాలలోకి చొచ్చుకుపోయి పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇక వైద్యులు అతనికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆ దంతాన్ని తొలగించారు. తొలగించిన దంతం సుమారు 14 మిల్లీ మీటర్లు పొడవు ఉంది. కాగా, ఈ శస్త్రచికిత్స అనంతరం అతడు శ్వాసకొస సమస్య నుంచి బయటపడ్డాడు.