నిజంగా నువ్వు దేవుడు సామి.. చనిపోయింది అనుకున్న పాముకు ఊపిరి పోశాడు.. వీడియో చూస్తే

సోషల్‌ మీడియాలో తరచూ అనేక ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను భయాందోళనకు గురిచేస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. అక్కడ ఓ వ్యక్తి స్పృహకోల్పయిన పాముకు తన నోటితో స్వాస ఇచ్చి ఊపిరిపోశాడు.

నిజంగా నువ్వు దేవుడు సామి.. చనిపోయింది అనుకున్న పాముకు ఊపిరి పోశాడు.. వీడియో చూస్తే
Snake Rescue Viral Video

Updated on: May 25, 2026 | 1:07 PM

పాము పేరు వింటే చాలా మంది భయంతో వణికి పోతారు. ఇక పాము కళ్ల ముందు కనిపిస్తే ఏమైనా ఉందో.. అక్కడ ఒక్క క్షణం కూడా కనిపించరు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి ఓ పాముకు జీవం పోశాడు. అవును ఎండలకు తట్టుకొలేక సొమ్మసిల్ల స్పృహకోల్పోయిన ఓ పాముకు నోటితో శ్వాస అందించి.. వాటర్ పైప్‌ ద్వారా నీటిని అందించి.. చివరకు అది మళ్లీ ప్రాణాలతో లేచేలా చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన ఓ పాము చూసి వ్యక్తి చలించిపోయాడు. దానికి ఎలాగైన బ్రతికించాలని అనుకున్నాడు. వెంటనే ఒక పైప్ తీసుకొని పైప్ ఒక కొనను పాము నోట్లో పెట్టి మరోసైడ్ అతను నోరుతో పాముకు శ్వాస అందించాడు. కానీ పాములో మాత్రం ఎలాంటి కదలిక కనిపించలేదు.. తర్వాత ఆ పైప్ పక్కన పడేది.. ఒక జగ్గులో నీళ్లు తీసుకొని.. చిన్న వాటర్ పైప్‌ను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వాటర్ పైప్‌ సహాయంతో దానికి నీళ్లు అందించాడు.. తర్వాత మళ్లీ పైప్‌ సహాయంతో దానికి శ్వాస అందించాడు.

తర్వాత ఆ పాము వీపుపై నెమ్మదిగా నెమిరాడు.. అంతే అప్పటి వరకు చనిపోయింది అనుకున్న పాములో ఒక్కసారిగా కదలికలు కనిపించాయి. వెంటనే పాము మేల్కొని ఊపిరిపీల్చుకుంది.. దీంతో సదురు వ్యక్తి మరోసారి దానికి నీటిని అందించి.. దగ్గరల్లోని చెట్లపొదల్లో వదిలేశాడు. ఇది చూసిన అందరూ అతని ధైర్యానికి, దయా గుణానికి మెచ్చుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు.

ఇదిగో వీడియో..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us