Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Major tragedy: ఇద్దరు యువకులు.. బైక్‌పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ క్రమంలో.. వెళుతువెళుతూ ఓ యువకుడు.. చేతిలోనున్న

Viral Video: వీళ్లను ఏమనాలి.. టపాసులు కాల్చి పెట్రోల్ బంకుపై విసిరిన ఆకతాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Crime

Updated on: Nov 03, 2021 | 5:18 PM

Major tragedy: ఇద్దరు యువకులు.. బైక్‌పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ క్రమంలో.. వెళుతువెళుతూ ఓ యువకుడు.. చేతిలోనున్న టపాసులకు నిప్పంటించి బంకుపై విసిరాడు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకుకు నిప్పంటించే ప్రయత్నంలో భాగంగానే యువకుడు దానిపై విసిరేసినట్లు పేర్కొంటున్నారు. సిబ్బంది అప్రమత్తం కాకపోతే.. ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించేది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పిప్లాడ్ ప్రాంతంలోని పెట్రోల్ పంపులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన అన్ని దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ నింపుకునేందుకు ఇద్దరు యువకులు స్కూటిపై అక్కడికి వచ్చారు. ముందు బైక్‌ను నడిపిన వ్యక్తి పెట్రోల్ నింపుకున్న తర్వాత వెనుకకు వెళ్లాడు. వెనుక కూర్చున్న వ్యక్తి బైక్‌ను స్టార్ట్ చేశాడు. అనంతరం వెళ్లిపోయే ముందు టపాసులకు నిప్పంటించి పెట్రోల్ పంపు మీదకు విసిరి వేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఒకరు.. ఆ క్రాకర్‌ను పైపు దగ్గర నుంచి కాలితో నెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఆ టపాసు కొంచెం దూరంలో పేలింది. పైపు దగ్గర క్రాకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది.

వీడియో..

Also Read:

Aadhaar: కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఆధార్’ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఇకపై భారీ జరిమానా..

Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..

Loading...
Unable to load recommendations.
Follow Us