Watch: ఏం ధైర్యం రా సామి.. పొలం గెట్లలో పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన లిటిల్ మాస్టర్!

పాము పేరు వింటేనే చాలా మంది భ‌యంతో వ‌ణికిపోతారు. అయితే కొంద‌రు మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని ప‌ట్టుకుని, ఆటబొమ్మల్లా ఆడిస్తుంటారు. కొంతమంది పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు. అది మాటల్లో చెప్పలేనిది. వారి ధైర్యం చూస్తే పెద్దలకు సైతం చెమటలు పట్టిస్తుంది. సాధారణంగా, పాములను చూడగానే జనం అమాడ దూరం పారిపోతాము. తాజాగా ఓ పిల్లాడు పామును పట్టుకుని పొలం గట్టుపై నిర్భయంగా ఓ ఆటాడుకున్నాడు.

Watch: ఏం ధైర్యం రా సామి..  పొలం గెట్లలో పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన లిటిల్ మాస్టర్!
Boy Playing With Snake

Updated on: Feb 07, 2026 | 3:47 PM

పాము పేరు వింటేనే చాలా మంది భ‌యంతో వ‌ణికిపోతారు. అయితే కొంద‌రు మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని ప‌ట్టుకుని, ఆటబొమ్మల్లా ఆడిస్తుంటారు. కొంతమంది పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు. అది మాటల్లో చెప్పలేనిది. వారి ధైర్యం చూస్తే పెద్దలకు సైతం చెమటలు పట్టిస్తుంది. సాధారణంగా, పాములను చూడగానే జనం అమాడ దూరం పారిపోతాము. తాజాగా ఓ పిల్లాడు పామును పట్టుకుని పొలం గట్టుపై నిర్భయంగా ఓ ఆటాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆందోళనకు గురిచేసింది.

నీటితో నిండిన పొలంలోకి భారీ విష సర్పం వచ్చింది. అక్కడే ఉన్న ఒక పిల్లవాడు పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ పిల్లవాడి ముఖంలో ఏమాత్రం భయం కనిపించలేదు. బదులుగా పామును పట్టుకోవాలనే అతని ఆత్రుత స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యకరంగా, పొలంలో పారిపోతున్న పామును వెంటపడి మరీ, అతను పామును పట్టుకోగలిగాడు. పాము అతన్ని కాటు వేయడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. కానీ ఆ పిల్లవాడు తాను నిపుణుడిలాగా దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సన్నివేశం అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పిల్లాడి ధైర్యానికి అందరు ఫిదా అవుతున్నారు.

ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Khadiza_kbc ఖాతా ద్వారా షేర్ చేశారు. “నిజమైన ఖదీజా ఆటగాడు! ఒక చిన్న మాస్టర్ చేసిన గొప్ప ఘనకార్యం. నగరవాసులు బల్లులకు భయపడతారు, కానీ ఇక్కడ చిన్న మాస్టారు పాముతో ఆడుకుంటున్నాడు.” అనే కాప్షన్ ఇచ్చారు. ఈ 26 సెకన్ల వీడియోను వేల సార్లు వీక్షించారు. చాలా మంది లైక్ చేశారు. వినియోగదారులు వివిధ రకాల ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. కొందరు “గ్రామస్తులు ఎవరికీ భయపడరు” అని అన్నారు, మరికొందరు “చిన్న మాస్టర్ ధైర్యానికి ఒక ఉదాహరణగా నిలిచాడు, కానీ ప్రమాదకరమైన క్రీడలలో జాగ్రత్త ఎల్లప్పుడూ అవసరం” అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, మరొక వినియోగదారు “ఇది నిజంగా నిజమైన సాహసోపేతమైనది. పెద్దలు కూడా భయపడినప్పుడు, ఈ పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడు” అని రాశారు. మరొక వినియోగదారు “ఈ పిల్లవాడు చాలా ధైర్యవంతుడు, కానీ అలా చేయడం కూడా చాలా ప్రమాదకరం” అని రాశారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..