Viral Video: సింహాన్ని మభ్యపెట్టి తప్పించుకున్న జింకపిల్ల.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే.!

|

Sep 08, 2021 | 4:11 PM

Lion Viral Video: సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే జంతువు కూడా మృగరాజుతో పోటీ పడేందుకు సాహసించవు...

Viral Video: సింహాన్ని మభ్యపెట్టి తప్పించుకున్న జింకపిల్ల.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే.!
Follow us on

సింహం వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే జంతువు కూడా మృగరాజుతో పోటీ పడేందుకు సాహసించవు. సింహం పంజా పవర్‌కు ఇదే నిదర్శనం. అందుకే సింహాన్ని అడవి రారాజు అని అంటారు. అయితే కొన్నిసార్లు ఎంతటి బలశాలి అయినా కూడా ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. వేటలో బలాన్ని ప్రదర్శించడం కంటే.. వ్యూహాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం.. లేదంటే ఎర తప్పించుకుని పారిపోతుంది. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సాధారణంగా సింహాలు ఒంటరిగా వేటాడితే గెలవడం కష్టం అని అంటుంటారు. అలాంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాని చిన్న జంతువుల విషయంలో సింహాలు ఎప్పుడూ గెలవడం కామన్. ఇక్కడ ఓ జింకపిల్లను పట్టుకునేందుకు ఆడ సింహం ప్రయత్నిస్తుంది. ఖచ్చితమైన వ్యూహాన్ని పన్నుతోంది. అయితే సీన్ కాస్తా రివర్స్ అవుతుంది. జింకపిల్ల తెలివి ముందు సింహం ఓడిపోతుంది. ఈ స్టోరీ ఏంటో మీరూ చూడండి.

ఓ సరస్సు ఒడ్డున జింక పిల్ల సేద తీరుతూ నీరు తాగుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అంతలో అకస్మాత్తుగా సింహం దానిపై దాడికి దిగుతుంది. వచ్చే ప్రమాదాన్ని గ్రహించిన జింకపిల్ల భయపడకుండా.. ధైర్యంతో సింహాన్ని ఎదుర్కుంటుంది. మృగరాజును మభ్యపెట్టి తన ప్రాణాలను దక్కించుకుంటుంది.

జింకపిల్ల తన తెలివిని అద్భుతంగా ప్రదర్శించిందని చెప్పవచ్చు. వేటాడేందుకు వస్తోన్న సింహాన్ని చాకచక్యంగా మరో మార్గం వైపుకు మళ్లించి తన ప్రాణాలను రక్షించుకుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. జింకపిల్ల తన తెలివిని అద్భుతంగా ప్రదర్శించిందని కామెంట్స్ చేస్తున్నారు. వరుసపెట్టి లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.