Viral News: ఇంట్లో చొరబడి చిరుత హల్‌చల్.. ఆరు గంటల తర్వాత అడవిలోకి..

|

Jul 25, 2024 | 3:45 PM

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నాగ్‌భిడ్ తాలూకా సావాంగి గ్రామంలో చిరుత పులి హల్చల్ చేసింది. ఆరు గంటల పాటు హడావిడి చేసిన చిరుత.. చివరికి అడవిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సావాంగిలోని సిన్ రాందాయే ఇంట్లో కట్టేసిన మేలకలపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అటకపై చిరుత దాక్కుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తీవ్ర భయాందోళనకు గురైన సిన్ రాందాయే కుటుంబ సభ్యులు..

Viral News: ఇంట్లో చొరబడి చిరుత హల్‌చల్.. ఆరు గంటల తర్వాత అడవిలోకి..
Viral News
Follow us on

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నాగ్‌భిడ్ తాలూకా సావాంగి గ్రామంలో చిరుత పులి హల్చల్ చేసింది. ఆరు గంటల పాటు హడావిడి చేసిన చిరుత.. చివరికి అడవిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సావాంగిలోని సిన్ రాందాయే ఇంట్లో కట్టేసిన మేలకలపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అటకపై చిరుత దాక్కుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తీవ్ర భయాందోళనకు గురైన సిన్ రాందాయే కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ సభ్యులు, భారీ వర్షం కురుస్తున్నా.. లెక్క చేయకుండా చిరుత కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సొసైటీ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ యానిమల్ ప్రొటెక్షన్ సమన్వయంతో ఆపరేషన్‌ ప్రారంభించారు. ప్రజలను దగ్గరలోని సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేన్ ఉద్రిక్తంగా కొనసాగింది. ఈ విషయాన్ని పసిగట్టిన చిరుత.. ఇంటి పైకప్పు పలకలను చీల్చుకుని నిర్మాణం పైకి ఎక్కి వేగంగా తిరిగి అడవిలోకి చేరుకుంది.

ఈ క్రమంలో అధికారులు సావాంగి గ్రామంలో హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అటవీ శాఖ, వైల్డ్‌ లైఫ్ రెస్క్యూ టీమ్‌లు సత్వరమే స్పందించి ఎలాంటి గాయాలు కాకుండా పరిస్థితిని విజయవంతంగా నిర్వహించారని గ్రామస్తులు ప్రశంసించారు. అధికారుల వేగవంతమైన చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ కారణంగా చిరుత పులి కూడా సురక్షితంగా అడవిలోకి చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.