
నార్వేలో ఉంటున్న వినోద్ అనే వ్యక్తి వీడియోను Xలో షేర్ చేశారు. ‘‘నార్వేలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ, ప్రతిసారీ షాపుకు వెళ్లినప్పుడు వేరు వేరు ధరలు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి’’ అని వినోద్ అన్నారు. నార్వేలోఆర్గానిక్ నిమ్మకాయలు కిలో ఏకంగా రూ.850 ధర పలుకుతుంటే, టమాటాలు కిలో రూ.680, ఒక్క దోసకాయ ధర రూ. 300గా ఉంది. అదే భారత్‌లోని మెట్రో నగరాల్లో నాణ్యతను బట్టి నిమ్మకాయలు కిలో రూ.90-110, టమాటాలు కిలో రూ.60-80, దోసకాయలు ఒక్కటి రూ.20-30 వరకు ఉంటాయి.
Even after living in Norway for years, it still surprises me every time I visit the butikk 😊🇳🇴
These are the daily prices of groceries:
Organic lemon: ₹850/kg, tomato: ₹680/kg, cucumber: ₹300 each 😳
In India’s metros, lemons can cost around ₹90–₹110/kg, tomatoes ₹60–₹80/kg, and cucumbers ₹20–₹30 each, depending on quality.
It’s 8 times cheaper than Norway, but salaries aren’t 8 times higher in Norway – not even close. Still, we complain as always.
It’s not about Norway’s cost structure, salaries, imports and so on… it just makes me wonder if we’re paying our farmers fair price, enough for their hard work in India. 🧡
What do you think, fam? Are we failing our farmers in India? 😌🇮🇳
— Vinod (@turiyatman) September 29, 2026
భారత్‌తో పోలిస్తే నార్వేలో కూరగాయలు దాదాపు ఎనిమిది రెట్లు ఖరీదైనవి అని వినోద్ తన పోస్టులో తెలిపారు. అయితే నార్వేలో జీతాలు భారత్‌తో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండవని వ్యాఖ్యానించారు. అయితే భారత్‌లో రైతులకు వారి శ్రమకు తగిన ధర లభిస్తుందా? అన్న ప్రశ్నతో నెటిజన్లను ఆలోచింపచేసారు.‘‘భారత్‌లో మనం రైతులకు న్యాయమైన ధర చెల్లిస్తున్నామా? వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందా?’’ అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు భారత్‌లో కూరగాయలు తక్కువ ధరకు లభించడం వల్ల సామాన్య ప్రజలకు రోజువారీ భోజనం అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం తక్కువ ధరల వెనుక రైతులకు అందుతున్న ఆదాయం, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు నార్వే, భారత్‌ల తలసరి ఆదాయం, జీవన వ్యయం, వేతనాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరలను పోల్చాలని సూచించారు. దీంతో ఈ వీడియో కేవలం కూరగాయల ధరల పోలికగా కాకుండా.. రైతులకు దక్కుతున్న ధర, వినియోగదారులపై భారం, వ్యవసాయ సరఫరా వ్యవస్థపై చర్చకు దారితీసింది.