
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రాజనాగును చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న భారీ రాజనాగు మాత్రం పదేపదే తూలుతూ, సమతుల్యత కోల్పోయి కిందపడిపోతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము తూలుతున్న తీరు చూసి కొందరు సరదాగా అది మద్యం తాగిందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోను @Mountain4u అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేశారు. ఈ వీడియోలో బురద, గడ్డి మధ్య భారీ రాజనాగు కనిపించింది. అది తన పడగను పైకి లేపి నిలబడేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అయితే ప్రతిసారి శరీరంపై నియంత్రణ కోల్పోయి.. తూలుతూ కిందపడిపోతూ ఉంది. పాము ప్రవర్తన చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వీడియోను షేర్ చేసిన యూజర్ కూడా పాము ‘70 రూపాయల దేశీ సరుకు’ తాగినట్లుగా అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టారు. దీంతో కామెంట్లలో నవ్వులు పూశాయి. “పాము తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది”, “నాగపంచమి రోజున పాలకు బదులు ఎవరో లిక్కర్ ఇచ్చారా?” అంటూ పలువురు చమత్కరించారు. మరికొందరు “ఇప్పటివరకు మనుషులే తాగేవారు.. ఇప్పుడు జంతువులు కూడా మొదలుపెట్టాయా?” అంటూ సరదాగా స్పందించారు.
అయితే పాము నిజంగానే మద్యం తాగిందా? అంటే అలా అనుకోవడానికి ఆధారం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాము ఇలా అసాధారణంగా తూలడానికి గాయం, ఇతర జంతువుతో జరిగిన పోరాటం, తీవ్రమైన నిర్జలీకరణ, విషప్రభావం, నాడీ సంబంధిత సమస్యలు వంటి కారణాలు ఉండవచ్చంటున్నారు. కాబట్టి వీడియో చూసి పాము మద్యం తాగిందని నిర్ధారించలేము. వీడియోకు సంబంధించిన ఖచ్చితమైన ప్రదేశం, పాము పరిస్థితికి అసలు కారణం కూడా స్వతంత్రంగా నిర్ధారించలేదు. ఏదేమైనా.. రాజనాగు అసాధారణ ప్రవర్తనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి…
साँप ने 70 वाला दारु का पव्वा पी लिया। pic.twitter.com/v7Xxw2UwI5
— Argumentor (@Mountain4u) August 20, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..