
కొన్ని క్షణాల ఆలస్యం జరిగి ఉంటే ఓ చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కానీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి, కండక్టర్ చాకచక్యంతో ఓ పసిబిడ్డ సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మలప్పురం జిల్లాలోని ఓ ప్రధాన రహదారిపై పాకుతూ వచ్చిన చిన్నారి ఒక్కసారిగా హైవేపైకి చేరుకుంది. అదే సమయంలో ఆ మార్గంలో ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తోంది. అయితే డ్రైవర్ దూరం నుంచే రోడ్డుపై చిన్నారిని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షణం ఆలస్యం చేయకుండా అత్యవసర బ్రేకులు వేయడంతో బస్సు చిన్నారికి కొద్ది అడుగుల దూరంలోనే ఆగిపోయింది.
బస్సు ఆగగానే కండక్టర్ వెంటనే కిందకు దిగి రోడ్డుపై ఉన్న చిన్నారిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఇతర వాహనాల నుంచి కూడా చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తప్పింది. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు డ్రైవర్, కండక్టర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి…
நடுரோட்டில் தவழ்ந்து வந்த பிஞ்சு, பின்னாடி வேகமா வந்த பஸ்! – பதற வச்ச காட்சி, பரவசப்படுத்துன முடிவு
கேரளம் – மலப்புறம் : புளிக்கல்ல நடுரோட்டுல பால் குடி குழந்தை ஒன்று தவழ்ந்து வந்துடுச்சு.
பஸ் டிரைவர் உடனே பிரேக் போட்டு நிறுத்த, கண்டக்டர் நவாஸ் ஓடிபோய் குழந்தைய தூக்கி அதன்… pic.twitter.com/sd8XRCWgS4
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) June 11, 2026
ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చిన్నారి హైవేపైకి ఎలా చేరుకుందనే విషయాన్ని స్థానికులు, అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే డ్రైవర్, కండక్టర్ చూపిన అప్రమత్తతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “ఓ క్షణంలో ప్రాణం కాపాడిన హీరోలు”, “ఇలాంటి డ్రైవర్లు సమాజానికి ఆదర్శం” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..