కర్నాటకలో ఓ లేడీ టీచర్ బరి తెగించారు. టెన్త్ క్లాస్ చదువుతున్న తన స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోటో షూట్ చేసి హల్‌చల్ చేశారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ మైనర్ కుర్రాడు ఆమెను ఎత్తుకున్నాడు కూడా. ఆ ఫోటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.
సాధారణంగా ప్రేమికులు, కొత్తగా పెళ్లైన జంటలు ఇలాంటి ఫోటో షూట్‌లు చేస్తే ఫర్వాలేదు. కాని ఇలా టీచర్ తన స్టూడెంట్‌తో ఫోటో షూట్ చేయడం తీవ్ర సంచలనం రేపింది. నెటిజన్లు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. టీచర్‌పై చర్య తీసుకోవాలంటున్నారు. సమాజం ఏ దిశలో పయనిస్తోంది అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ షూట్‌లో పాల్గొన్న మహిళా టీచర్.. మురుగమళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్టూడెంటేమో అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. స్టడీటూర్ సందర్భంగా ఈ ఫొటోషూట్ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.