బిల్లు చెల్లించేందుకు వెళ్లాడు.. ‘పేరు’ చూసి పరువు పోయింది..! కస్టమర్‌ పేరుకు బదులు ఏముందంటే?

బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్ బిల్లు తీసుకున్న ఓ కస్టమర్‌.. అందులో తన పేరు లేకుండా తన శరీరాకృతి, దుస్తుల ఆధారంగా చేసిన వర్ణన చూసి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో పంచుకోవడంతో ఘటన వైరల్‌గా మారింది.

బిల్లు చెల్లించేందుకు వెళ్లాడు.. ‘పేరు’ చూసి పరువు పోయింది..! కస్టమర్‌ పేరుకు బదులు ఏముందంటే?
Restaurant Bill , Bengaluru

Updated on: Aug 23, 2026 | 10:12 AM

బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్ బిల్లు తీసుకున్న ఓ కస్టమర్‌.. అందులో తన పేరు లేకుండా తన శరీరాకృతి, దుస్తుల ఆధారంగా చేసిన వర్ణన చూసి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో పంచుకోవడంతో ఘటన వైరల్‌గా మారింది.

కోరమంగళలోని సుబ్కో ది క్రాఫ్టరీకి వెళ్లిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేసి బిల్లు చెల్లించాడు. అనంతరం రసీదును పరిశీలించగా, కస్టమర్ వివరాల స్థానంలో అతని పేరుకు బదులుగా ‘చిన్న లావుపాటి నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి’ అనే అర్థం వచ్చేలా సిబ్బంది వర్ణన రాశారని గుర్తించాడు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రసీదు స్క్రీన్‌షాట్‌ను రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు.

Subko didn’t use my name
by
u/Prior_Customer_4240 in
BangaloreSocial

కస్టమర్‌ను గుర్తించేందుకు పేరు, టేబుల్ నంబర్, ఆర్డర్ వివరాలు ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ.. తన శరీరాకృతిని ఎందుకు గుర్తింపుగా ఉపయోగించారని ప్రశ్నించాడు. ముఖ్యంగా ఆ వ్యాఖ్య తనను శరీరాకృతికి మాత్రమే పరిమితం చేసినట్టు అనిపించిందని, అది బాధ కలిగించిందని పేర్కొన్నాడు. పురుషుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అయినా దాన్ని సరదాగా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

ఈ పోస్టుపై నెటిజన్ల మధ్య విస్తృత చర్చ జరిగింది. కొందరు రెస్టారెంట్ సిబ్బంది చేసిన వ్యాఖ్యను అనుచితమైన హాస్యంగా అభివర్ణించగా, మరికొందరు కస్టమర్‌ను గుర్తించేందుకు శరీరాకృతిని ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. వివాదం నేపథ్యంలో సుబ్కో కాఫీ రోస్టర్స్‌ స్పందించింది. సంస్థ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని నిశ్శబ్దంగా ముగించకుండా బహిరంగంగానే పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. “అధిక బరువు ఉన్న వ్యక్తిని అవమానించడం తప్పు. ఏ రూపంలోనైనా, ప్రతిసారీ, ఎలాంటి మినహాయింపులు లేకుండా అది తప్పే” అని సంస్థ స్పష్టం చేసింది. జరిగిన తీరుకు కస్టమర్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు, ఫిర్యాదును పరిష్కరించే అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాలని సూచించింది.

కస్టమర్‌ ఫిర్యాదును బహిరంగంగా అంగీకరించి బాధ్యత తీసుకున్నందుకు కొందరు సుబ్కోను ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు అసలు చోటుచేసుకోకుండా సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ఘటన రెస్టారెంట్లలో కస్టమర్ల వ్యక్తిగత గౌరవం, బాడీ షేమింగ్‌పై మరోసారి చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us