మరో కొత్త ఛాలెంజ్.. బొద్దింకలతో..!

| Edited By:

May 09, 2019 | 1:19 PM

మీరు ఏవైనా పోటీలు, కొత్త సవాళ్లను చేయాలనుకున్నా, చూడాలనుకున్నా.. సోషల్ మీడియా కన్నా మంచి వేదిక ఎక్కడా ఉండదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఐస్ బకెట్ ఛాలెంజ్, ఫిట్ నెస్ ఛాలెంజ్, కికీ ఛాలెంజ్ తరహాలో ఇలాంటి చాలా వీడియోలు నిరంతరం మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. వాటిలో సృజనాత్మకత కన్నా.. వాటిని చేసి చూపించాలన్న కోరికే స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీటి వల్ల చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే.. తాజాగా.. […]

మరో కొత్త ఛాలెంజ్.. బొద్దింకలతో..!
Follow us on

మీరు ఏవైనా పోటీలు, కొత్త సవాళ్లను చేయాలనుకున్నా, చూడాలనుకున్నా.. సోషల్ మీడియా కన్నా మంచి వేదిక ఎక్కడా ఉండదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఐస్ బకెట్ ఛాలెంజ్, ఫిట్ నెస్ ఛాలెంజ్, కికీ ఛాలెంజ్ తరహాలో ఇలాంటి చాలా వీడియోలు నిరంతరం మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. వాటిలో సృజనాత్మకత కన్నా.. వాటిని చేసి చూపించాలన్న కోరికే స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీటి వల్ల చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

అయితే.. తాజాగా.. ఒక ఛాలెంజ్‌ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అదే బొద్దింకల ఛాలెంజ్.. బ్రతికున్న బొద్దింకను ముఖం మీద వేసుకుని.. ముఖమంతా అది తిరుగుతుంటే చలించకుండా అలాగే ఉండాలి. అలెక్స్ అనే యువకుడు ఈ ఛాలెంజ్‌ను కనిపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయత్నించి రీ పోస్టులు కూడా చేస్తున్నారు.

అయితే.. గతంలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఖత్రోంకే ఖిలాడి రియాల్టీ షో సందర్భంగా బొద్దింకలను తన శరీరంపై వేయించుకుని చేసిన ఛాలెంజ్‌ను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.