క్యాబ్ డ్రైవర్ అంటే తక్కువా?.. ఐటీ ఇంజనీర్‌ను వెక్కిరించిన అమ్మాయిలు..నెటిజన్ల ఫైర్

ఈ రోజుల్లో చదువుకున్న వారందరికీ ఐటీ రంగంలోనే ఉద్యోగాలు లభించడం లేదు. మరికొందరు తమ ఖాళీ సమయాల్లో అదనపు ఆదాయం కోసం లేదా ఉద్యోగం లేని సమయంలో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్లుగా, డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారు. అయితే, ఒక ఉబెర్ డ్రైవర్ తాను ఐటీ ఇంజనీర్ అని చెప్పినప్పుడు కొందరు ప్రయాణికులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

క్యాబ్ డ్రైవర్ అంటే తక్కువా?.. ఐటీ ఇంజనీర్‌ను వెక్కిరించిన అమ్మాయిలు..నెటిజన్ల ఫైర్
It Engineer Uber Driver

Updated on: May 25, 2026 | 5:45 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో చాలా వీడియోలు మనల్ని ఆలోచింపజేసిగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా.. ఒక ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న కొందరు అమ్మాయిలు, తమ డ్రైవర్ ఒక ఐటీ ఇంజనీర్ అని తెలిసి అతనిని చూసి నవ్విన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ డ్రైవర్ తన విద్యా అర్హతను చెప్పినప్పుడు, వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయిలు దానిని ఒక జోక్‌గా భావించి నవ్వడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు అమ్మాయిల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏం జరిగింది..?

కార్లో ప్రయాణిస్తున్న కొందరు అమ్మాయిలు డ్రైవర్‌తో మాట్లాడుతుండగా, అతను తాను ఒక ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఇంజనీర్ అని చెబుతాడు. ఆ మాట వినగానే వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయిలు ఏమాత్రం సంకోచించకుండా పెద్దగా నవ్వడం మొదలుపెడతారు. అతను ఏదో జోక్ చేస్తున్నాడనే కోణంలో వారు నవ్వడం, ఆ డ్రైవర్‌ను కాస్త ఇబ్బందికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు అమ్మాయిల ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమైనదే, కష్టపడి డబ్బు సంపాదించడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు అంటూ నెటిజన్లు డ్రైవర్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఐటీ రంగంలో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ఎక్కువగా ఉన్నాయని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖాళీగా కూర్చోకుండా క్యాబ్ నడుపుతూ సొంతంగా సంపాదించుకోవడం అభినందించదగ్గ విషయమని మరికొందరు పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఒకప్పుడు క్యాబ్ డ్రైవింగ్ లేదా డెలివరీ పనులను కేవలం నిర్దిష్ట వర్గాల వారే చేసేవారు. కానీ నేడు గిగ్ ఎకానమీ (Gig Economy) పెరగడం వల్ల విద్యావంతులైన యువత కూడా పార్ట్-టైమ్‌గా ఇలాంటి యాప్ ఆధారిత సేవలలో చేరుతున్నారు. ఎదుటివారి వృత్తిని తక్కువ చేసి చూడటం ఐక్యూ (IQ) లేకపోవడమేనని, అమ్మాయిలు ప్రవర్తించిన తీరు సమాజంలో ఇంకా మారాల్సిన ఆలోచనా విధానాన్ని సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us