తాచు పాము తలనిమురుతూ.. నీరు త్రాగించిన వ్యక్తి..

| Edited By:

Jun 24, 2019 | 8:52 AM

సాధారణంగానే పాము అంటేనే భయపడతాం.. ఇంక దాన్ని చూస్తే.. అంతే పరుగులే.. పరుగులు.. అలాంటిది తాచుపాము పడగ విప్పితే ఇక అంతే సంగతులు. మాములుగా భయపడం. అది ఎక్కడ కాటేస్తుందోనని భయంతో పరుగులు పెడతాం. కానీ ఎండలకు దాహంతో విలవిలలాడుతున్న కింగ్‌ కోబ్రాకు ఓ ఫారెస్ట్ అధికారి వాటర్ తాగించాడు. పడగ విప్పిన పాము తలపై నిమురుతూ వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరటితోటలో ఎండకు పడగవిప్పి […]

తాచు పాము తలనిమురుతూ.. నీరు త్రాగించిన వ్యక్తి..
Follow us on

సాధారణంగానే పాము అంటేనే భయపడతాం.. ఇంక దాన్ని చూస్తే.. అంతే పరుగులే.. పరుగులు.. అలాంటిది తాచుపాము పడగ విప్పితే ఇక అంతే సంగతులు. మాములుగా భయపడం. అది ఎక్కడ కాటేస్తుందోనని భయంతో పరుగులు పెడతాం. కానీ ఎండలకు దాహంతో విలవిలలాడుతున్న కింగ్‌ కోబ్రాకు ఓ ఫారెస్ట్ అధికారి వాటర్ తాగించాడు. పడగ విప్పిన పాము తలపై నిమురుతూ వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అరటితోటలో ఎండకు పడగవిప్పి అటూ ఇటూ తిరుగుతోన్న కోబ్రాను గమనించిన ఓ అటవీశాఖ అధికారి దాని దగ్గరకు వెళ్లాడు. దాహంతో పడగను నిమురుతూ మంచినీళ్ల బాటిల్‌ను పాము నోటి వద్ద ఉంచాడు. అంతే దాహంతో ఉన్న కింగ్ కోబ్రా చకచకా వాటర్ తాగేసింది.

ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలియనప్పటికీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికారి సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.