మమ్మల్ని మేము చూసుకోగలం.. మీ పని మీరు చూసుకోండి

| Edited By: Ram Naramaneni

Apr 16, 2019 | 10:53 AM

ఇండోనేషియాలోని బాలిలో ఓ స్విమ్మింగ్ పూల్‌ అంచులో… కెల్లీ, కొడీ అనే జంట లిప్ లాక్ చేస్తూ ఫోటోకు పోజిచ్చారు.. ఇక ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే ఆ జంట మీద నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. లైఫ్ రిస్క్ చేసి మరీ.. ఫొటోకు పోజ్ ఇవ్వడం అవసరమా అని కొందరు మండిపడ్డారు. మరికొందరైతే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటి సాహసం చేస్తారా అని ఆ జంటకు చీవాట్లు పెట్టారు. ఇక నెటిజన్ల […]

మమ్మల్ని మేము చూసుకోగలం.. మీ పని మీరు చూసుకోండి
Follow us on

ఇండోనేషియాలోని బాలిలో ఓ స్విమ్మింగ్ పూల్‌ అంచులో… కెల్లీ, కొడీ అనే జంట లిప్ లాక్ చేస్తూ ఫోటోకు పోజిచ్చారు.. ఇక ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే ఆ జంట మీద నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. లైఫ్ రిస్క్ చేసి మరీ.. ఫొటోకు పోజ్ ఇవ్వడం అవసరమా అని కొందరు మండిపడ్డారు. మరికొందరైతే సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటి సాహసం చేస్తారా అని ఆ జంటకు చీవాట్లు పెట్టారు. ఇక నెటిజన్ల నుండి తీవ్రమైన ట్రోలింగ్ ను ఎదుర్కున్న ఈ జంట.. వారికీ ఘాటైనా కౌంటర్ ఇచ్చింది.

మేము సేఫ్.. మా గురించి మేము చూసుకోగలం.. మీ పని మీరు చూసుకోండి అంటూ.. ఆ పూల్ పూర్తి ఫోటో పెట్టి నెటిజన్లకు ఆ జంట కౌంటర్ ఇచ్చింది. క్రియేటివిటీ, ఫోటోగ్రఫీ, సృజనాత్మకతకు రూపంగా ఆ ఫోటోను మేము తీశాం. మా సంతోషాలను, సాహసాలను మేము జ్ఞాపకాలుగా ఉంచుకోవాలని మా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పోస్ట్ చేసుకుంటాం. ఇక ఈ ఫొటోలో మేము ఏమి స్టంట్ చెయ్యలేదు.. కేవలం సృజనాత్మకతను మాత్రమే మా కెమెరాలో బంధించాలనుకున్నాం అని ఆ జంట తెలిపారు. కాగా వారు పోజ్ ఇచ్చిన స్విమ్మింగ్ పూల్ ను ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ అని పిలుస్తారు. అంటే.. ఆ స్విమ్మింగ్ పూల్‌కు జాయింట్‌గా మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఏదైనా నదికి గానీ, సముద్రానికి గానీ ఆ స్మిమ్మింగ్ పూల్ కనెక్ట్ అయి ఉంటుంది. నీళ్ల ప్రవాహం కూడా ఉంటుంది. వాళ్లు స్విమ్మింగ్ చేస్తున్న పూల్ కింద మరో పూల్ ఉంది. అందువల్ల ఒకవేళ అదుపు తప్పి ఆ యువతి కింద పడినా కింద మరో పూల్ ఉండటంతో ఏం కాదు.. అందుకే ఆ ధైర్యంతోనే వాళ్లు ఈ సాహసం చేశారు.