వార్నీ.. బార్‌ భలే ఉందిగా.. చెట్టు తొర్రలో తాగుబోతుల అడ్డా.. మందు, స్టవ్‌ ఏలా ఉంటుందో తెలిస్తే..

చెట్టు తొర్రలో వెలసిన శివపార్వతులు..ఇలాంటి వార్తలు మనం గతంలో అనేకం విన్నాం.. అయితే ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వార్త నిజంగానే విచిత్రమైనది..ప్రపంచంలో రకరకాల థీమ్‌లతో రూపుదిద్దుకున్న రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కానీ, ఒక చెట్టు తొర్రలో బార్ ఉందంటే నమ్ముతారా? అదీ ఒకటో రెండో వందల ఏళ్ల నాటి చెట్టు కాదు... ఏకంగా 6,000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన భారీ వృక్షం లోపల ఒక పబ్ నడుస్తోంది. ఈ అద్భుతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ వింత పబ్‌ ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..

వార్నీ.. బార్‌ భలే ఉందిగా.. చెట్టు తొర్రలో తాగుబోతుల అడ్డా.. మందు, స్టవ్‌ ఏలా ఉంటుందో తెలిస్తే..
World's Most Unique Bar

Updated on: Aug 04, 2026 | 1:08 PM

ప్రపంచం థీమ్‌లతో కూడిన బార్‌లు, రెస్టారెంట్లతో నిండి ఉంది. కొన్నింటిలో ఐస్ కేఫ్‌లు ఉంటే, కొన్ని నీటి అడుగున భోజనం చేసే సౌకర్యాన్ని అందిస్తాయి. మరికొన్ని పర్వత శిఖరాలపై కూడా భోజనం చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ, ప్రపంచంలో ఒక హోటల్‌లోనో, పర్వతం మీదో, లేదా సముద్రం పక్కనో కాకుండా 1,060 ఏళ్ల పురాతనమైన చెట్టు లోపల ఒక బార్ ఉందని ఎవరైనా మీకు చెబితే ఊహించుకోండి. మొదట నమ్మడం కష్టంగా ఉండవచ్చు. కానీ, దక్షిణాఫ్రికాలోని బిగ్ బాబాబ్ ట్రీ బార్ నిజంగా అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒక భారీ బాబాబ్ చెట్టు బోలు కాండం లోపల నిర్మించబడిన ఈ బార్, సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

సన్‌లాండ్ బావోబాబ్ విశేషాలు:

ఈ చెట్టును స్థానికంగా సన్‌లాండ్ బావోబాబ్ అని పిలుస్తారు. బావోబాబ్ జాతికి చెందిన చెట్లు వేలాది సంవత్సరాల పాటు జీవిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ ఈ చెట్ల కాండం లోపలి భాగం సహజంగానే ఖాళీగా అవుతూ పెద్ద తొర్రలా మారుతుంది. 1993లో ఈ భూమి యజమానులు చెట్టు లోపల ఉన్న భారీ ఖాళీ స్థలాన్ని గమనించి, దానికి ఎలాంటి హాని కలగకుండా ఒక సుందరమైన బార్‌గా తీర్చిదిద్దారు.

ఇవి కూడా చదవండి

చెట్టు లోపల ఏమేమి ఉంటాయి?:

ఈ చెట్టు తొర్ర ఎంత పెద్దదంటే… లోపల ఒకేసారి 15 నుంచి 20 మంది పర్యాటకులు కూర్చుని గడపవచ్చు. చెట్టు లోపల డ్రింక్స్ నిల్వ చేయడానికి డ్రాఫ్ట్ బీర్ కుళాయిలు, సౌండ్ సిస్టమ్, సహజమైన వాతావరణం ఉంటాయి. ఈ చెట్టు చుట్టుకొలత సుమారు 47 మీటర్లు అంటే..154 అడుగులు కాగా, ఎత్తు 19 మీటర్లకు పైగా ఉంటుంది.

కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఈ చెట్టు వయస్సు దాదాపు 1,060 సంవత్సరాలు అని తేలింది. అంటే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కూడా ఇది ప్రాచీనమైనది! విశేషమేమిటంటే, చెట్టు లోపల బార్ నడుస్తున్నప్పటికీ, చెట్టు ఏమాత్రం దెబ్బతినకుండా ప్రతీ ఏటా కొత్త ఆకులు పూస్తూ పచ్చగా కనువిందు చేసేది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ వింతైన బార్‌లో డ్రింక్ సేవించే అనుభూతి కోసం ఇక్కడికి వచ్చేవారు. రైతులు, పర్యావరణ వేత్తలు ఈ ప్రాచీన వృక్షాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చారు. ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఈ బావోబాబ్ ట్రీ బార్ ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన వింతగానే నిలిచిపోతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us