Viral Video: ట్రక్ హారన్ సౌండ్‌‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుడ్డోళ్లు.. వీడియో వైరల్..

|

Aug 12, 2024 | 5:14 PM

సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ వీడియో ట్రెండింగ్‌లోకి వస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా నెట్టింట చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు, జంతువులకు చెందని వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. కాస్త వెరైటీగా అనిపించిందంటే చాలు.. క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుము మనం మాట్లాడుకోబోయే వీడియో కూడా ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు..

Viral Video: ట్రక్ హారన్ సౌండ్‌‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుడ్డోళ్లు.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ వీడియో ట్రెండింగ్‌లోకి వస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా నెట్టింట చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు, జంతువులకు చెందని వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. కాస్త వెరైటీగా అనిపించిందంటే చాలు.. క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుము మనం మాట్లాడుకోబోయే వీడియో కూడా ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక రకాలైన హారన్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు తమకు నచ్చిన విధంగా లేదంటే.. వెరైటీగా ఉండేందుకు హారన్ సౌండ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు.

ఒక్కోసారి డీజే సౌండ్స్‌ని మించిన హారన్స్ ఉంటాయి. కొన్ని వినసొంపుగా ఉంటే.. మరికొన్ని మాత్రం తలనొప్పిని తెప్పిస్తాయి. అలాగే ఇప్పుడు ఓ ట్రక్‌కి సంబంధించిన హారన్ సౌండ్‌కి ఇండోనేషియాకి చెందని ఇద్దరు పిల్లలు తెగ డ్యాన్స్ చేశారు. అదిరిపోయే స్టెప్పులు వేసి వావ్ అనిపించారు. ఈ వీడియో చూస్తుంటే మీకు తెలీకుండానే మీ పెదాలపై నవ్వు అనేది వచ్చేస్తుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్‌ దగ్గర ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. అప్పుడు అటు నుంచి మంచి హారన్ సౌండ్‌‌తో ఓ ట్రక్ వచ్చింది. ఆ సౌండ్‌కి తగ్గ బీట్‌తో పిల్లలు ఇద్దరు తెగ డ్యాన్స్ చేశారు.

ఆ ట్రక్‌ పై ‘ది వండర్ ఉమెన్’ అని రాసి ఉంది. డ్రైవర్ వైపు చూస్తు ఇంకా మరింత ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. నిజంగానే ఆ హారన్ సౌండ్‌కి పిల్లల డ్యాన్స్ మూమెంట్స్‌కి సరిగ్గా బీట్ సరిపోయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు రెండు మిలియన్ల వరకూ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.