చీరకు మ్యాక్సీ డ్రెస్ అని పేరు పెట్టి రూ. 26 వేలకు విక్రయం..సదరు బ్రాండ్‌పై నెటిజన్ల ఫైర్!

భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే, విదేశీ ఫ్యాషన్ బ్రాండ్లు తరచుగా భారతీయ సంస్కృతికి చెందిన డిజైన్లను తమ సొంత ఆవిష్కరణలుగా ప్రచారం చేసుకుంటూ వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. తాజాగా లాస్ ఏంజెల్స్ కి చెందిన ఒక ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ భారతీయ చీరను వినూత్న పేరుతో విక్రయిస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

చీరకు మ్యాక్సీ డ్రెస్ అని పేరు పెట్టి రూ. 26 వేలకు విక్రయం..సదరు బ్రాండ్‌పై నెటిజన్ల ఫైర్!
Saree Sold For 26000 Rupees

Updated on: Aug 22, 2026 | 6:39 PM

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఒక ఫ్యాషన్ బ్రాండ్ భారతీయ సంప్రదాయ చీరను డ్రేప్డ్ మ్యాక్సీ డ్రెస్ పేరుతో భారీ ధరకు విక్రయిస్తుండటంపై ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంప్రదాయ చీరకు కొత్త పేరు పెట్టి, భారీ ధరకు అమ్మడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. చీర అసలు గుర్తింపును, క్రెడిట్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించి, పాశ్చాత్య ఫ్యాషన్ డిజైన్‌గా ప్రచారం చేయడం పట్ల భారతీయ నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సదరు ఎల్.ఎ ఫ్యాషన్ బ్రాండ్ తమ కొత్త కలెక్షన్‌లో భాగంగా ఒక ప్రసిద్ధ భారతీయ చీర మోడల్‌ను ప్రదర్శించింది. అయితే, దానికి సారీ లేదంటే, చీర అని పేరు పెట్టడానికి బదులుగా, డ్రేప్డ్ మ్యాక్సీ డ్రెస్ అని పేరు మార్చింది. అంతటితో ఆగకుండా, ఆ దుస్తుల ధరకు ఏకంగా $300 డాలర్ల పైనే అది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 26,000లుగా ధర నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు సదరు బ్రాండ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శతాబ్దాల నాటి భారతీయ సాంస్కృతిక దుస్తులకు సరైన క్రెడిట్ ఇవ్వకుండా, పాశ్చాత్య ఫ్యాషన్ పేరుతో అధిక ధరలకు విక్రయించడాన్ని కల్చరల్ అప్రాప్రియేషన్ అని మండిపడుతున్నారు. భారతీయ సంప్రదాయ చీరబ్రాండ్ పెట్టిన కొత్త పేరుడ్రేప్డ్ మ్యాక్సీ డ్రెస్ విక్రయ ధరరూ. 26,000 ($300+ డాలర్లు)నెటిజన్ల ప్రధాన అభ్యంతరం సంస్కృతికి క్రెడిట్ ఇవ్వకపోవడం, అధిక ధర.

ఇది సాధారణ చీర మాత్రమే! దానికి విదేశీ పేరు తగిలించి రూ. 26 వేలకు అమ్ముతారా? అని ఒక యూజర్ కామెంట్ చేయగా, భారతీయ చేనేత రంగానికి, సాంస్కృతిక వారసత్వానికి క్రెడిట్ ఇవ్వకుండా ఇలా కాపీ కొట్టడం దారుణం అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలు అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఖాట్ (నులక మంచం), కుర్తాలను వింత పేర్లతో అధిక ధరలకు విక్రయించి వివాదాల్లో నిలిచాయి. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన పాశ్చాత్య ఫ్యాషన్ ప్రపంచంలో భారతీయ కళలకు దక్కాల్సిన అసలైన గుర్తింపుపై మరోసారి చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us