Dance Video: అమెరికా వీధుల్లో ఓ యువ కళాకారుడు స్కర్ట్, లెహంగా ధరించి డ్యాన్స్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యువ కళాకారుడు ఐశ్వర్యరాయ్ నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్‌లోని ధోలీ తారో ధోలా బజే పాటకు అద్భుతంగా స్టెప్పులేశాడు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. కాగా ఈ యువ కళాకారుడి పేరు జైనిల్ మెహతా. వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్. తరచూ అమ్మాయిల్లా తయారై ఇలా హిందీ పాటలకు డ్యాన్స్ లేస్తుంటాడు. ఇతనికి సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్ ఉంది. అందుకే అతను పోస్ట్ చేసిన వీడియోలు క్షణాల్లోనే వైరలవుతుంటాయి. గత నెలలోనూ జైనిల్ స్కర్ట్, చొక్కా ధరించి అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి మూవీలోని జుమే రే గోరీకి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.ఈ వీడియోకి దాదాపు రెండు కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అదేవిధంగా పుష్ప సినిమాలోని సామి సామి పాటకు కూడా డాన్స్ చేశాడు. ఆ వీడియో కూడా సూపర్ వైరల్ అయ్యింది.
కొన్ని రోజుల క్రితం గురు సినిమాలోని ఐశ్వర్య రాయ్ నటించిన బర్సోరే సాంగ్‌కు కూడా జైనిల్ మెహతా కాలు కదిపాడు. ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అలా తాజాగా ఐశ్వర్యారాయ్ నటించిన మరో సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్‌లోని ధోలీ తారో ధోలా బజే సాంగ్‌కు కూడా అద్భుతంగా స్టెప్పులేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరలవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా లక్షలాది లైకులు, వేలాది కామెంట్లు వస్తున్నాయి. ‘లవ్ దిస్ స్కర్ట్.. ఇట్స్ గార్జియస్’ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా.. అంత బరువైన స్కర్ట్‌తో మీరు మెట్లపై ఎలా డ్యాన్స్ చేయగలిగారు’ అని మరొకరు అడిగారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..