Indian Dog Breeds: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరికొత్త ప్రయోగం.. శత్రువులను గుర్తించేందుకు ఏకంగా శునకాలను..

|

Jan 04, 2021 | 7:08 PM

Indian Dog Breeds: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. బార్డర్‌లో ఎముకలు కొరికే చలిలోనూ భారత సైనికులు విధులు

Indian Dog Breeds: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరికొత్త ప్రయోగం.. శత్రువులను గుర్తించేందుకు ఏకంగా శునకాలను..
Follow us on

Indian Dog Breeds: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. బార్డర్‌లో ఎముకలు కొరికే చలిలోనూ భారత సైనికులు విధులు నిర్వర్తిస్తుంటారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శత్రుదేశాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతు గస్తీ కాస్తుంటారు. అయితే భవిష్యత్తులో శునకాలు సైతం అక్కడ విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అందుకోసం బీఎస్ఎఫ్ షిల్లాంగ్‌లో రెండు భారత సంతతి శునకాలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం.

బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ‘రాజపలయం, ముధోల్’ అనే రెండు రకాల ఇండియన్ బ్రీడ్స్‌కు ట్రయల్ బేసిస్‌లో శిక్షణనిస్తున్నారు. ఏడాది పాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని, అది పూర్తయిన వెంటనే బార్డర్‌లో పెట్రోలింగ్ కోసం వీటిని వినియోగించనున్నట్లు చెప్పారు. ట్రయల్ సక్సెస్ అయితే మిలిటరీ శునకాల మాదిరి వీటితో పాటు ఇతర బ్రీడ్స్‌ను సైన్యంలో చేర్చుకుంటారని వివరించారు. బీఎస్ఎఫ్ మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ కూడా పలు ఇండియన్ డాగ్ బ్రీడ్స్‌ను ఫోర్స్‌లో జాయిన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని చదవండి:

మళ్లీ గుబులు రేపుతున్న పెద్దపులి సంచారం.. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో క్షణం క్షణం.. భయం భయం..