ఎదిగిన కొడుకు మరణం.. 22 ఏళ్లు భద్రపరిచిన పిండంతో మళ్లీ.. !

గ్రీస్‌లో ఓ 54 ఏళ్ల మహిళ, 60 ఏళ్ల ఆమె భర్త  నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.  గత ఏడాది రోడ్డు యాక్సిడెంట్‌లో 21 ఏళ్ల కుమారుడిని కోల్పోయిన జంట,  లైఫ్ లో  బిగ్గెస్ట్ ట్రాజెడీ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు. సరిగ్గా 22 ఏళ్ల కింద ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోతో ఇటీవల ఆడపిల్లకు  జన్మనిచ్చింది ఆ మహిళ.  గ్రీస్ చట్టాల ప్రకారం ఐవీఎఫ్‌కి ఏజ్ లిమిట్ 54 ఏళ్లు ఉండగా, కరెక్ట్‌ టైమ్‌కి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుని మరీ అసాధ్యం అనుకున్న దానిని సాధించారు.  

ఎదిగిన కొడుకు మరణం.. 22 ఏళ్లు భద్రపరిచిన పిండంతో మళ్లీ.. !
Greek Couple Welcome Daughter Born From A Frozen Embryo

Updated on: Sep 12, 2026 | 1:59 PM

జీవితంలో అత్యంత విషాదకర క్షణం నుంచి ఆ గ్రీకు దంపతులు కోలుకుని,  కొత్త ప్రయాణం ప్రారంభించారు. దశాబ్దాల క్రితం భద్రపరిచిన క్రిస్టినా రాప్టి-పిండాలలో ఒకదాన్ని ఉపయోగించి, ప్రభుత్వ గడువు లోపు ఐవీఎఫ్ పక్రియను పూర్తి చేసేందుకు క్రిస్టినా చేసిన పరుగే ఈ అద్భుతానికి కారణమైంది.  గతేడాది అక్టోబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో  21 ఏళ్ల కుమారుడు మరణించడంతో ఆ విషాదం వారిని వెంటాడింది. అయితే  మరోసారి సంతానం కోసం 22 ఏళ్ల కిందట ఫ్రీజ్ చేసి ఉంచిన పిండాన్ని ఉపయోగించి  ప్రయత్నించాలని ఆ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గ్రీకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐవీఎఫ్‌ (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) ప్రక్రియను పూర్తి చేయడానికి, జాతీయ ప్రాధికార సంస్థ నుంచి అనుమతి పొందడానికి మహిళలకు గరిష్ట వయోపరిమితి 54 ఏళ్లు. రాప్టి-ట్జెలేపి 54 ఏళ్లకు దగ్గరపడటంతో సమయం చాలా తక్కువగా ఉంది.

లైఫ్ లో మళ్లీ చిగురించిన కొత్త ఆశలు

‘కేవలం రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది, ఎంతో ఒత్తిడి మధ్య  డాక్టర్ల టీమ్ సపోర్ట్‌తో అన్ని అడ్డంకులను దాటేశాను.  మా ఇంటిని నవ్వులతో నింపిన మా మొదటి బిడ్డలాగే ఈ పాప కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఎదగాలని కోరుకుంటున్నాను, ‘’ అంటూ క్రిస్టినా తన జర్నీని షేర్ చేసుకున్నారు. ఏథెన్స్‌ హాస్పిటల్‌లో బుధవారం 3.5 కేజీల బేబీ గర్ల్‌కు ఆమె జన్మనిచ్చారు. తెల్లటి వస్త్రంలో చుట్టి ప్రశాంతంగా నిద్రిస్తున్న కుమార్తెను 60 ఏళ్ల తండ్రి కాన్‌స్టాంటినోస్ రాప్టిస్ తన భుజంపై ఎత్తుకున్నారు. తమ కుటుంబంలో మళ్లీ ఆశలను చిగురింపజేసిన డాక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘విషాదం నుంచి బయటపడ్డాం. జీవితం పై మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి ’’ అని కాన్‌స్టాంటినోస్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చనిపోయిన తమ కొడుకు జార్జ్ జ్ఞాపకార్థం ఆ చిన్నారికి ‘జార్జియా’ అని నామకరణం చేశారు.

 లైఫ్‌లో ఎంత పెద్ద కుదుపు వచ్చినా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చని ఈ జంట ఎగ్జాంపుల్ సెట్ చేశారు!  గ్రీసులో చట్టం కఠినంగా ఉండటంతో మహిళకు 54 ఏళ్లు దాటి ఒక్క రోజు ఎక్కువైనా గర్భం దాల్చడానికి అనుమతించరు. చట్టంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us