నీ ప్లాన్ మామూలుగా లేదక్కా.. పిచ్చొళ్లు అయిపోయారంతా.. వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియాలో రోజుకో వైరల్ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తుంది. తాజాగా ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. మా అమ్మ నా పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తుంది అనే చిన్న క్యాప్షన్‌తో నవ్వుతూ గుండు చేయించుకున్న ఒక యువతి వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ ఎవరా యువతి? ఏంటా కథ అనేది తెలుసుకుందాం..

నీ ప్లాన్ మామూలుగా లేదక్కా.. పిచ్చొళ్లు అయిపోయారంతా.. వీడియో చూస్తే అవాక్కే..
Girl Shaves Head After Her Mother Planning Marriage

Updated on: Jul 14, 2026 | 3:33 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు నవ్విస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఒక యువతి నవ్వుతూ గుండు చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఆమె గుండు చేయించుకోవడం కంటే, ఆ వీడియోకు పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలోని యువతి పేరు కీర్తన్ మీనన్ అని తెలుస్తోంది. వీడియోలో కీర్తన్ ప్రశాంతంగా కూర్చుని ఉంది. బార్బర్ ఆమె జుట్టును పూర్తిగా తీసేస్తున్నా ఆమె ముఖంలో ఎలాంటి బాధ కనిపించలేదు. చాలా కూల్‌గా, నవ్వుతూ ఆమె గుండు చేయించుకుంది. ఈ వీడియోకు ఆమె జోడించిన క్యాప్షన్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ‘‘ నా తల్లిదండ్రులు నా పెళ్లి నిశ్చయించారు. అందుకే నేను గుండు చేయించుకుంటున్నాను’’ అంటూ ఆమె ఆ వీడియోపై రాసుకొచ్చింది. పెళ్లి చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఆమె ఈ గుండు చేయించుకుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల మధ్య మహా సంగ్రామం: ఇది నిరసనా? మరేదైనా?

ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా యూజర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేసే పెళ్లిళ్లకు ఇదొక వినూత్న నిరసన అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘నీ ధైర్యానికి హాట్సాఫ్ సోదరి, ఈ కాలపు సమస్యలకు ఇదొక సినిమాటిక్ సొల్యూషన్’’ అంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు. మహిళల స్వేచ్ఛకు, వారి సొంత నిర్ణయాలకు ఇది ప్రతీక అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పాలి కానీ, ఇలా గుండు చేయించుకుని సోషల్ మీడియాలో పెట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అసలు నిజం ఏంటీ?

ఈ వీడియో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. తాను పెళ్లికి నిరసనగానే ఈ పని చేశానని కీర్తన్ మీనన్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసిన స్టంట్ కావచ్చని.. లేదా దేవుడి మొక్కులో భాగంగా ఇలా చేసి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఆమె స్వయంగా స్పందించే వరకు దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటనేది మిస్టరీనే..

వీడియో చూడండి..

Follow Us