Viral Video: ఓరి దేవుడా.. రోడ్ అనుకున్నారా..సర్కస్ అనుకున్నారా.. ఒకే స్కూటీపై ఐదుగురు..

|

Aug 19, 2024 | 7:21 PM

సాధారణంగా బండి అనగానే ఇద్దరికే అలో ఉంటుంది. పిల్లలు ఉంటే ఫ్యామిలీకి పర్మిషన్. కానీ ఇద్దరి కంటే ఎక్కువగా బండి మీద కనబడ్డారో.. బండిపై, బండి ఎక్కిన వారిపై ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. ఎన్నో కేసులు కూడా అయ్యాయి. ఇప్పటికే బండి మీద నలుగురు, ముగ్గురు కలిసి వెళ్లిన వీడియోలు చాలానే చూశాం. ఈ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. కానీ వీళ్లు వాళ్ల కంటే ముదుర్లు అనుకుంటా..

Viral Video: ఓరి దేవుడా.. రోడ్ అనుకున్నారా..సర్కస్ అనుకున్నారా.. ఒకే స్కూటీపై ఐదుగురు..
Viral Video (1)
Follow us on

సాధారణంగా బండి అనగానే ఇద్దరికే అలో ఉంటుంది. పిల్లలు ఉంటే ఫ్యామిలీకి పర్మిషన్. కానీ ఇద్దరి కంటే ఎక్కువగా బండి మీద కనబడ్డారో.. బండిపై, బండి ఎక్కిన వారిపై ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. ఎన్నో కేసులు కూడా అయ్యాయి. ఇప్పటికే బండి మీద నలుగురు, ముగ్గురు కలిసి వెళ్లిన వీడియోలు చాలానే చూశాం. ఈ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. కానీ వీళ్లు వాళ్ల కంటే ముదుర్లు అనుకుంటా.. ఏకంగా ఒక స్కూటీపై ఐదుగురు ఎక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో.. ఓ స్కూటీపై ఐదుగురు యువకులు వెళ్తున్నారు. అది గమనించిన ఓ యువతి ఇదంతా వీడియో తీసింది. పక్కనే ఓ కారులో ఈ యువతి వెళ్తుంది. వాళ్లను చూసి షాక్.. వీడియో తీసింది. అంతే కాకుండా నవ్వుతుంది. యువతి వీడియో తీయడాన్ని బండిపై వెళ్తున్న వాళ్లు కూడా గమనించారు. వీడియో తీస్తున్న యువతి వైపు చూస్తూ.. కేకలు పెట్టారు. ఐదుగురు ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తున్నారు. నలుగురు యువకులు సీటుపై కూర్చోగా.. మరొక వ్యక్తి స్కూటీ కాళ్లు పెట్టుకునే దగ్గర కూర్చొన్నారు. వీళ్లంతా ఎక్కడితో వెళ్తున్నారు. వీడియోలో చూస్తుంటే సమయం అర్థరాత్రిలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది చాలా ప్రమాదకరమైనది’.. ‘వావ్ ఇలా కూడా బండి మీద వెళ్లొచ్చా’.. ‘ఈ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కి దొరికితే మామూలుగా ఉండదు’.. ‘ఇండియా ఈజ్ నాట్ వర్ బిగినర్స్’.. ‘వీళ్లకు డబ్బులు మిగులు’.. అంటూ ఎన్నో ఫన్నీ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.