Viral Video: ఇదెందయా ఇది.. ఇట్టా కూడా జరిగిద్దా.. పిల్లి దెబ్బకు గింగిరాలు తిరిగిన ఆవు..!

|

Jul 19, 2022 | 8:10 PM

Viral Video: భూమిపై మనుషులు ఎలా జీవిస్తున్నారో.. జంతువులు కూడా అలాగే జీవిస్తున్నాయి. అయితే, మనకు తెలిసిన జంతువులతో పాటు..

Viral Video: ఇదెందయా ఇది.. ఇట్టా కూడా జరిగిద్దా.. పిల్లి దెబ్బకు గింగిరాలు తిరిగిన ఆవు..!
Funny Video
Follow us on

Viral Video: భూమిపై మనుషులు ఎలా జీవిస్తున్నారో.. జంతువులు కూడా అలాగే జీవిస్తున్నాయి. అయితే, మనకు తెలిసిన జంతువులతో పాటు.. తెలియని జీవులు భూమిపై కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అందుకే.. ఇప్పటికీ ఆ జీవుల కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటి సంగతి అలా ఉంచితే.. మనుషుల మధ్య, మనుషులతో కలిసి జీవించే జీవులు చాలానే ఉన్నాయి. పెంపుడు జీవులైన పిల్లి, కుక్క, కోళ్లు, ఆవులు, మేకలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

అయితే, సాధారణంగానే మనకు ఎవరైనా కొత్తగా, విచిత్రంగా వ్యక్తులు కనిపిస్తే వింతగా చూస్తాం. ఎవర్రాబాబూ అని కొంచెమైనా ఆలోచిస్తాం. జంతువులు కూడా అలాగే చేస్తాయి. తాజాగా అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, అది పరేషాన్ అయి.. జనాలకు నవ్వులు పూయించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఆవు దూడ, చిన్న పిల్లి ఉన్నాయి. ఆవు దూడ కట్టేసి ఉండగా.. దాని పక్క నుంచే పిల్లి వెళ్తోంది. ఆ పిల్లిని గమనించిన ఆవు దూడ.. నెమ్మదిగా ఆ పిల్లి దగ్గరకు వచ్చింది. ఏదో వింత అన్నట్లుగా దానిని పరికించి మరీ చూస్తోంది. మరోవైపు ఆవుదూడను తన శత్రువు అనుకుందో ఏమో గానీ.. ఆ పిల్లి గుర్రుమంటూ కోపం తెచ్చుకుంది. ఆవుదూడ సమీపించగానే.. ఒక్కసారిగా బెదిరించింది. ఆ పిల్లి అరుపులకు బెదిరిపోయిన ఆవుదూడ గిర్రున తిరుగుతూ పల్టీలు కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్న పిల్లి బెదిరింపులకు ఆవుదూడ పల్టీలు కొడుతూ కింద పడిపోవడం చిత్రంగా ఉందంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. మళ్లీ మళ్లీ ఆ సీన్‌ను చూసుకుంటూ నవ్వేసుకుంటున్నారు.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..