
ప్రపంచంలో వింత వ్యక్తులకు, వారి వింత అలవాట్లకు కొదవలేదు. జర్మనీకి చెందిన లిన్నెయా (Linnea) అనే మహిళ టాటూల పట్ల తనకున్న పిచ్చిని తారస్థాయికి తీసుకెళ్లి వార్తల్లో నిలిచింది. జర్మనీకి చెందిన లిన్నెయా అనే మహిళకు టాటూలంటే ప్రాణం. కేవలం కొన్ని బొమ్మలతో సరిపెట్టుకోకుండా, తన శరీరాన్ని ఒక కాన్వాస్‌లా మార్చుకుంది. ఇప్పటికే శరీరం మొత్తం నల్లటి ఇంకుతో (Blackout Tattoos) నిండిపోయింది. దీని కోసం ఆమె ఇప్పటివరకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.
శరీరంపై ఖాళీ లేకపోవడంతో ఆమె తన దృష్టిని నాలుకపైకి మళ్లించింది. అత్యంత సున్నితమైన నాలుక భాగంలో నల్లటి రంగును ఇంజెక్ట్ చేయించుకుని, తన నాలుకను పూర్తిగా నల్లగా మార్చుకుంది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. నాలుకపై టాటూ వేయించుకోవడం అనేది చాలా నొప్పితో కూడుకున్న పని మాత్రమే కాదు, అది రుచిని కోల్పోయేలా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అద్భుతమైన కళ అని కొందరు అంటుంటే, నిజమైన రూపాన్ని ఇలా పాడుచేసుకోవడం విచారకరం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే లిన్నెయా మాత్రం తనకు తన కొత్త రూపం చాలా ఇష్టమని, ఇతరుల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని చెబుతోంది.
టాటూలు వేయించుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
టాటూల పట్ల మక్కువ ఉన్నవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లైసెన్స్ ఉన్న, అనుభవం ఉన్న ఆర్టిస్ట్ దగ్గరే టాటూ వేయించుకోవాలి. వాడే నీడిల్స్ కొత్తవా కాదా అని సరిచూసుకోవాలి. టాటూ వేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, ఇలాంటి ఫ్యాషన్ పేరుతో చేసే ఇలాంటి ప్రయోగాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. ముఖ్యంగా కళ్లలో, నాలుకపై టాటూలు వేయించుకోవడం వంటివి వైద్యపరంగా చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..