45 ఏళ్లనాటి దొంగను పట్టించిన 80ల నాటి ఏఐ ట్రెండ్ .. కథలో ట్విస్ట్

దాదాపు 45 ఏళ్ల క్రితం నేరం చేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఒక మహిళ,  కృత్రిమ మేధ (AI)  ఫొటో వల్ల  పోలీసులకు చిక్కింది. 45 ఏళ్ల క్రితం 1980ల ఆరంభంలో ఉజ్జయినిలోని ఒక నగల దుకాణానికి ఓ యువతి వెళ్లింది. ఆ దుకాణంలో బంగారు గొలుసును దొంగిలించి ఆమె పరారైంది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..

45 ఏళ్లనాటి దొంగను పట్టించిన 80ల నాటి ఏఐ ట్రెండ్ .. కథలో ట్విస్ట్
From 80s Ai Trend To 45 Year Old Theft Case At Ujjain

Updated on: Sep 17, 2026 | 10:07 PM

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న 1980ల నాటి  సరదా ట్రెండ్, ఏకంగా 45 ఏళ్ల కిందటి దొంగతనం కేసును పరిష్కరించింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నేరం చేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఒక మహిళ,  కృత్రిమ మేధ (AI)  ఫొటో వల్ల  పోలీసులకు చిక్కింది. 45 ఏళ్ల క్రితం 1980ల ఆరంభంలో ఉజ్జయినిలోని ఒక నగల దుకాణానికి ఓ యువతి వెళ్లింది. ఆ దుకాణంలో బంగారు గొలుసును దొంగిలించి ఆమె పరారైంది. అప్పట్లో పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె తన పేరును మార్చుకుని కొత్త గుర్తింపుతో జీవిస్తుంది. 
ఇటీవల సోషల్ మీడియాలో ‘1980ల నాటి ఫొటో’ బాగా ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు ఏఐ సాయంతో తాము ఆ కాలంలో ఎలా ఉండేవారమో తెలిపే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో, దశాబ్దాల క్రితం చోరీకి పాల్పడిన ఆ మహిళ కూడా సరదాగా తన ఏఐ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ సోషల్ మీడియా పోస్ట్ యాదృచ్ఛికంగా సదరు నగల దుకాణం యజమాని కంటపడింది. 45 ఏళ్ల క్రితం తన దుకాణంలో చోరీ చేసిన యువతిగా ఆమెను గుర్తుపట్టారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించగా, రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. సరదా కోసం మొదలైన సోషల్ మీడియా ట్రెండ్, ఊహించని రీతిలో దశాబ్దాల నాటి కేసును పరిష్కరించింది.

కథలో ట్విస్ట్ ఏంటంటే

ఇదీ ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం.  ఈ కథనం ఓ సినిమా స్క్రిప్ట్‌లా ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా కల్పితమైన ఫేక్ వార్త అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. కేవలం వినోదం, లైకుల కోసం సృష్టించిన వ్యంగ్య కథనం అని బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ఉజ్జయిని పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, అసలు ఇలాంటి కేసే నమోదు కాలేదు. భారతీయ చట్టాల ప్రకారం చిన్న దొంగతనాలకు 3 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దొంగతనం జరిగిన 3 ఏళ్ల లోపు మాత్రమే కోర్టులు ఆ కేసును విచారణకు స్వీకరిస్తాయి.  45 ఏళ్ల నాటి ఒక చిన్న దొంగతనం కేసును రీ ఓపెన్ చేసి ఎవరినీ అరెస్ట్ చేయడం సాధ్యం కాదు.  టెక్నాలజీ ద్వారా పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు నమ్మిస్తూ ఈ కథ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది కానీ, ప్రాక్టికల్‌గా చూసినట్లయితే ఉజ్జయినిలో ఇలాంటి అరెస్ట్ ఏదీ జరగలేదని తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us