నీటిలో చేపలకు ఆక్సిజన్ కావలెను..!

|

May 14, 2019 | 3:14 PM

బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD).. నీటిలో ఇమిడి ఉండాల్సిన కనీస ప్రాణవాయువు శాతం..! నీళ్లలోని ఆర్గానిక్ మెటీరియల్ ని బ్రేక్ చేయగలిగేంత స్థాయిలో ఆక్సిజన్ ఉండి తీరాల్సిందే! దీనితో మనకు ఎటువంటి ప్రమేయం లేకపోవచ్చు. కానీ నీళ్ళే ఆధారంగా బతికే చేపల విషయంలో BOD చాలా కీలకం. కానీ.. నీళ్లలో BOD స్థాయి క్రమంగా తగ్గిపోతోందన్నది ఒక ఆందోళన కలిగించే అంశం. వాతావరణంలో జరిగే అనూహ్య మార్పుల వల్ల.. కాలుష్యం పెరగడంతో పాటు.. దాని ప్రభావం నీటి […]

నీటిలో చేపలకు ఆక్సిజన్ కావలెను..!
Follow us on

బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD).. నీటిలో ఇమిడి ఉండాల్సిన కనీస ప్రాణవాయువు శాతం..! నీళ్లలోని ఆర్గానిక్ మెటీరియల్ ని బ్రేక్ చేయగలిగేంత స్థాయిలో ఆక్సిజన్ ఉండి తీరాల్సిందే! దీనితో మనకు ఎటువంటి ప్రమేయం లేకపోవచ్చు. కానీ నీళ్ళే ఆధారంగా బతికే చేపల విషయంలో BOD చాలా కీలకం. కానీ.. నీళ్లలో BOD స్థాయి క్రమంగా తగ్గిపోతోందన్నది ఒక ఆందోళన కలిగించే అంశం. వాతావరణంలో జరిగే అనూహ్య మార్పుల వల్ల.. కాలుష్యం పెరగడంతో పాటు.. దాని ప్రభావం నీటి కంపొజిషన్ మీద పడుతోంది. క్రమంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతోందనడానికి ఒక live example.. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో కనిపిస్తోంది.

ఇక్కడి నీళ్లలో ఆక్సిజన్ కనీస మోతాదులో కూడా లేకపోవడంతో.. చేపలు బతకలేక బైటికొచ్చి ‘చచ్చిపోతున్నాయి’. ఉపరితలంలో కృత్రిమంగా గాలి పీల్చుకోడానికి చేపలు పడే అవస్థలు చూస్తే.. మన గుండెలు తరుక్కుపోవడం ఖాయం. సహజవిరుద్ధమైన ఈ వాతావరణానికి అలవాటుపడలేక ప్రత్యేకించి చేపపిల్లలు విలవిల్లాడిపోతున్నాయి. ఈ సంకట పరిస్థితిని నివారించడం కోసం కొన్ని మార్గాలు లేకపోలేదంటోంది మత్స్య శాఖ. కొలనులో నీళ్లకు తగినంత వేడి తగిలేలా చేయడం, ఎయిర్ హీటర్లు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు నీళ్లను మార్చడం లాంటివి ఒక అత్యవసరం.