Viral Video: చేపను పట్టుకుందామని ఎర వేశాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్‌..

|

Jan 08, 2023 | 1:57 PM

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని మాత్రం భయం కలిగిస్తుంటాయి. అలాంటి ఓ భయానక వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది...

Viral Video: చేపను పట్టుకుందామని ఎర వేశాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్‌..
Fish Viral Video
Follow us on

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని మాత్రం భయం కలిగిస్తుంటాయి. అలాంటి ఓ భయానక వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా చేపను పట్టుకోవడానికి ఎర వేస్తుంటారు. అలాగే ఓ వ్యక్తి చేప కోసం ఎర వేశాడు. అయితే ఆ చేప ఇచ్చిన ట్విస్ట్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. చేప ఇచ్చిన షాక్‌కు అతడి దిమ్మదిరిగిపోయింది.

వివరాల్లోకి వెళితే… ఓ వ్యక్తి సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో భాగంగా సముద్ర తీరానికి వెళ్లాడు. అదే సమయంలో నీటిలో చిన్న చిన్న చేపలు కనిపించాయి. వాటిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఎర వేస్తూ చేపలను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో నీటిలోని చేపలు మెల్లి మెల్లిగా భయటకు రావడం ప్రారంభించాయి. అయితే అంతలోనే ఓ పెద్ద చేప హఠాత్తుగా పైకి దూసుకొచ్చింది.

సదరు వ్యక్తి చేతిని ఉన్నపలంగా నోటిన కరిచేసింది. సగానికిపైగా చేతిని కొరికేసింది. కష్టపడి ఒక చేతిని విడిపించుకున్నాడు. అయితే వెంటనే ఆ చేప మరో చేతిని కొరికేసింది. ఒకానొక సమయంలో అతన్ని సముద్రంలోకి లాక్కెంతలా ప్రయత్నించింది ఆ చేప. అయితే చివరికి ఏమైందన్నది మాత్రం ఆ వీడియోలో లేదు. ఏదో సరదగా చేద్దామనుకుంటే సీన్‌ కాస్త రివర్స్‌ అయ్యింది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోగా తీయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..