Optical Illusion: చిత్రంలో దాగి ఉన్న తప్పును మీరు కనిపెడితే.. నిజంగా తోపులే..

|

Aug 22, 2024 | 6:14 PM

ప్రస్తుత కాలంలో పెద్దలకు అయినా.. పిల్లలకు అయినా కాలక్షేపం ఏది అంటే సోషల్ మీడియా అనే చెప్పొచ్చు. సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇంటర్నెట్‌లో చాలా మంది ఇప్పుడు వీటినే ఎక్కువగా ఆడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల ఎంతో టైమ్ పాస్ అవుతుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళన..

Optical Illusion: చిత్రంలో దాగి ఉన్న తప్పును మీరు కనిపెడితే.. నిజంగా తోపులే..
Optical Illusion
Follow us on

ప్రస్తుత కాలంలో పెద్దలకు అయినా.. పిల్లలకు అయినా కాలక్షేపం ఏది అంటే సోషల్ మీడియా అనే చెప్పొచ్చు. సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇంటర్నెట్‌లో చాలా మంది ఇప్పుడు వీటినే ఎక్కువగా ఆడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల ఎంతో టైమ్ పాస్ అవుతుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతున్నాయి.

ఈ పజిల్స్ అనేవి ఎక్కడ కనిపించినా వదిలి పెట్టకుండా ఆడుతున్నారు. ఇవి మెదడుకు కూడా వ్యాయామంలా ఉంటున్నాయి. వీటిని ఆడుతూ ఉండటం వల్ల ఏకాగ్రత, ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. తాజాగా మీ కోసం ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో తీసుకొచ్చాం. ఈ చిత్రంలో ఉన్న తప్పును మీరు 30 సెకన్ల లోపు కనిపెడితే ఖచ్చితంగా మీరు తోపు అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఇందులో నలుగురు పిల్లలు పిజ్జా తింటూ ఉన్నారు. పిల్లలు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడటానికి ఈ ఫొటోలో ఏం తప్పు ఉంది అనిపిస్తుంది కదా.. కానీ అందులోనే చిక్కు ఉంది. అదేంటో కనిపెట్టండి. కాస్త నిశితంగా పరిశీలిస్తే జవాబు మీకు ఖచ్చితంగా దొరకుతుంది. ఈ చిత్రంలో ఖచ్చితంగా ఓ పెద్ద మిస్టేక్ ఉంది. అదే మీరు కనిపెట్టాలి. ఇంకెందుకు లేట్ మరి ఆ పనిలో ఉండండి.

ఏంటండీ మీకు ఇంకా మీరు ఆ తప్పును కనిపెట్టలేక పోయారా.. ఏం పర్వాలేదు.. ఈ కింద ఉన్న ఫొటో చూడండి.

ఈ చిత్రంలో.. టేబుల్ మీద ఓ పిజ్జా బాక్స్ ఉంది. నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు పిజ్జా తింటున్నారు. కానీ బాక్స్‌లో మాత్రం మూడు పీసులు మాత్రమే మిస్ అయ్యాయి. అంటే ఓ పీస్ అదనంగా వచ్చి చేరింది. ఇదే ఈ చిత్రంలోని మిస్టేక్. ఇది ముందుగా ఎవరు కనిపెట్టారో వారి బ్రెయిన్ చాలా షార్ప్.