Photo Puzzle: మీ ఐ ఫోకస్ అంత రేంజా.? ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..

|

Apr 04, 2024 | 10:06 AM

సోషల్ మీడియాలో వినోదమే కాదు.. విజ్ఞానానికి కావాల్సిన సమాచారం కూడా దొరుకుతుంది. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైతే.. మన మెదడుకు మాత్రమే కాదు.. బుర్రను కూడా పదునుపెడతాయి. ఇలాంటి చిత్రాల్లో పైకి కనిపించేది ఒకటి.. లోపల కనిపించేది మరొకటి. వాటికి సమాధానాలు మనం కనుక్కోవడంలోనే ఉంటుంది అసలైన మజా.

Photo Puzzle: మీ ఐ ఫోకస్ అంత రేంజా.? ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us on

సోషల్ మీడియాలో వినోదమే కాదు.. విజ్ఞానానికి కావాల్సిన సమాచారం కూడా దొరుకుతుంది. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైతే.. మన మెదడుకు మాత్రమే కాదు.. బుర్రను కూడా పదునుపెడతాయి. ఇలాంటి చిత్రాల్లో పైకి కనిపించేది ఒకటి.. లోపల కనిపించేది మరొకటి. వాటికి సమాధానాలు మనం కనుక్కోవడంలోనే ఉంటుంది అసలైన మజా. సరిగ్గా అలాంటి ఓ వైరల్ ఫోటో పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. మీ కంటి చూపు అదుర్స్ అయితే.. చిటికెలో ఆన్సర్ కనిపెట్టండి.

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మంచులాంటి ప్రదేశంలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఎదురుచూస్తున్నట్టు మీరు చూడవచ్చు. చుట్టూ కొన్ని చెట్లు.. మంచుతో కప్పబడ్డ ప్రదేశం.. ఇలాంటి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని మీరు కనిపెట్టగలరా.? మీ ఐ ఫోకస్ గ్రేట్ అయితే.. ఎలుగుబంటిని క్షణాల్లో కనిపెట్టండి చూద్దాం. మీరు మేధావులైతే.. కేవలం 15 సెకన్లలోనే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం. మీకు చిన్న క్లూ కావాలంటే.. ఈ ఫోటోను తలకిందులుగా చూస్తే ఎలుగుబంటి ఎక్కడుందో తెలిసిపోతుంది. ఒకవేళ అంత వెతికినా దొరక్కపోతే.. అప్పుడు సమాధానం కోసం కింద ఫోటో చూడండి.